టీమిండియాకు టీ20 క్రికెట్‌లో కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఆగస్టు నెలలో మూడు టీ20ల కోసం భారత జట్టు ఐర్లాండ్ వెళ్లనుంది. ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఐర్లాండ్ సిరీస్‌లో మాత్రం కొత్త కెప్టెన్‌కు జట్టు పగ్గాలు ఇవ్వనున్నారట. ఈ సిరీసులో పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం.
వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీసుల్లో హార్దిక్ ఆడతాడు. ఈ క్రమంలో మళ్లీ ఆసియా కప్‌లో కూడా అతను టీంకు కీలకం. అందుకే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా హార్దిక్‌కు ఐర్లాండ్ సిరీసులో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. విండీస్ టూర్ తర్వాత పాండ్యా అభిప్రాయాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారట.

'ఈ విషయంలో ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు. విండీస్‌లో వన్డేలు, టీ20ల తర్వాత పాండ్యా అభిప్రాయాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ట్రావెలింగ్‌కు ఎక్కువ టైం లేదు. ఫ్లోరిడా నుంచి డబ్లిన్‌కు మూడు రోజుల గ్యాప్‌లో వచ్చేసి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దానికితోడు ప్రస్తుతం మా ఫోకస్ అంతా వరల్డ్ కప్ మీదనే ఉంది. కాబట్టి వర్క్‌లోడ్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వరల్డ్ కప్‌లో రోహిత్ డిప్యూటీ పాండ్యానే అని మర్చిపోకూడదు' అని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్లు ఎవరూ ఐర్లాండ్ వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ సిరీసులో జట్టు పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అందించాలని బీసీసీ భావిస్తోందట. ఆసియా క్రీడలకు పంపే ముందు రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా ఇది మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతుందని బీసీసీఐ పెద్దల ఆలోచన. ప్రస్తుతానికైతే వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. కీలకమైన ప్లేయర్లను జాగ్రత్తగా చూసుకుంటోంది.