For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం.. నిబంధనలు ఇవే!!

BCCI invites applications for men’s and women’s teams selectors

ముంబై: సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, సభ్యుడు గగన్‌ ఖోడా స్థానంలో నూతన సెలక్టర్ల కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 చివరి తేదీగా బీసీసీఐ ప్రకటించింది. సీనియర్‌తో పాటు మహిళల సెలక్షన్‌ కమిటినీ బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. జూనియర్‌ కమిటీలో మాత్రం రెండు మార్పులు చేస్తోంది.

సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం

సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం

ఐదుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీలో ఏర్పడబోయే రెండు ఖాళీల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. పదవీకాలం ముగిసిపోవడంతో ప్రసాద్‌తో పాటు గగన్‌ తప్పుకోనున్నారు. వీరి స్థానాల్లో కొత్త సెలక్టర్లు వస్తారు. అయితే మిగిలిన ముగ్గురు సెలక్టర్లు శరణ్‌దీప్‌ సింగ్, దేవాంగ్‌ గాందీ, జతిన్‌ పరాంజపేలు మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. అభ్యర్థులను క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) ముఖాముఖి చేస్తుంది. మదన్‌ లాల్‌, గౌతమ్‌ గంభీర్‌, సులక్షణ నాయక్‌ సీఏసీలో సభ్యులుగా ఉంటారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

పెద్దగా మార్పులేమీ లేవు

పెద్దగా మార్పులేమీ లేవు

ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య ఆరు. సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుభవం విషయంలో ప్రసాద్‌ ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త సెలక్టర్‌ ఎంపికకు అర్హత విషయంలో బీసీసీఐ పెద్దగా మార్పులేమీ చేయలేదు. కెరీర్‌లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వారు సీనియర్‌ జట్టు సెలక్టర్‌ పదవికి అర్హులని తాజాగా ప్రకటించింది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎంపికకు నిబంధనలు రూపొందించారు.

గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లు

గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లు

సెలక్టర్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. దీంతో పాటు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. ఇక గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లుగా రూపొందించారు.

న్యూజిలాండ్‌ సిరీసే చివరి ఎంపిక

న్యూజిలాండ్‌ సిరీసే చివరి ఎంపిక

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో చివరిసారిగా ఆదివారం భారత సీనియర్‌ జట్టు ఎంపిక జరగనుంది. న్యూజిలాండ్‌లో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌ కోసం జట్లను ప్రసాద్ కమిటీ ఎంపిక చేస్తుంది. వన్డే, టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టుజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శుబ్‌మన్‌ గిల్‌ను రిజర్వ్‌ ఓపెనర్‌గా ఉంచారు. ఐదో పేసర్‌గా నవదీప్‌ సైనీ వైపే మొగ్గు కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమై టీ20లకు దూరమైన హార్దిక్‌ పాండ్యా.. ఇప్పుడు ఫిట్‌గా మారితే వన్డేల్లోకి రానున్నాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది.

సెలక్టర్ల నిబంధనలు

సెలక్టర్ల నిబంధనలు

# సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ అభ్యర్థులకు వయసు 60 లోపు ఉండాలి.

# అభ్యర్థి కనీసం 7 టెస్టులు/30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. లేదా 10 వన్డేలు/20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవం.

# అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.

# జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ అభ్యర్థులకు 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల అనుభవం కావాలి.

# మహిళల సెలక్షన్‌ అభ్యర్థులు టీమిండియా తరఫున కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాలి.

Story first published: Sunday, January 19, 2020, 12:07 [IST]
Other articles published on Jan 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+