Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్ఘన్‌తో టెస్టుకు భారీగా ఏర్పాట్లు చేస్తోన్న బీసీసీఐ

BCCI invites Afghanistan President Ashraf Ghani for the historic Test in Bangalore

హైదరాబాద్: అఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా జూన్‌ 14న ఆరంభం కానుంది. ఈ విషయంపై వివరణ ఇస్తూ.. కాబూల్‌లో బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరీతో కూడిన అధికార బృందం అఫ్గానిస్థాన్‌తో భవిష్యత్‌ పర్యటనల గురించి అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ అతిఫ్‌ మాషాల్‌ చర్చించినట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే బీసీసీఐ బృందం ఆ దేశ‌ అధ్యక్షుడిని కూడా కలిసినట్లు తెలిసింది. 'ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఈ చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌ ఎంతగానో దోహదపడుతుందని.. ఈ క్రమంలోనే అధ్యక్షుడిని కూడా ఆహ్వానించినట్లు' సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

ఈ విషయమై బీసీసీఐ అధికార బృందం తమ అధ్యక్ష కార్యాలయానికి వచ్చినట్లు అక్కడి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే అఫ్ఘన్ అధ్యక్షుడికి పిలుపైతే అందింది. కానీ, ఈ మ్యాచ్‌కు హాజరవుతారా లేదా అనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం తెలియరాలేదు.

ఇదిలా ఉండగా జూన్‌ 14న చిన్నస్వామి స్డేడియంలో జరగనున్న ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు తాజాగా అఫ్గానిస్థాన్‌ 16మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ సహా నలుగురు స్పిన్నర్లు జట్టులో ఉన్నారు.

ఆడనున్న ఇరు జట్లు ఇవే:
టీమిండియా:
1. అజింక్య రహానే(కెప్టెన్)
2. శిఖర్ ధావన్
3. మురళీ విజయ్
4. కేఎల్ రాహుల్
5. చతేశ్వర్ పుజారాః
6. కరుణ్ నాయర్
7. సాహా (వికెట్ కీపర్)
8. రవిచంద్రన్ అశ్విన్,
9. రవీంద్ర జడేజా
10. కుల్దీప్ యాదవ్
11. ఉమేశ్ యాదవ్
12. మహ్మద్ షమీ
13. హార్దిక్ పాండ్య
14. ఇషాంత్ శర్మ
15. శార్ధూల్ ఠాకూర్.

అఫ్గాన్ జట్టు:
1. అస్గర్ స్టానిక్‌జాల్
2. మొహమ్మద్ షాజాద్
3. జావేద్ అహ్మది
4. రహ్మ త్ సింగ్
5. ఇహ్‌సానుల్పాహ జనత్
6. నజీర్మ జమాల్
7. హస్మతుల్లా షాహిదీ
8. అఫ్సర్ జజాయ్
9. మొహమ్మద్ నబీ
10. రషీద్ ఖాన్
11. జహీర్ ఖాన్
12. హమ్జా హోటక్
13. సయ్యద్ అహ్మద్ షిర్జాద్
14. యామిన్ అహ్మద్‌జై
15. వఫాదర్
16. ముజీబ్ ఉర్ రహ్మన్

Story first published: Thursday, May 31, 2018, 9:56 [IST]
Other articles published on May 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+