రిషబ్ పంత్ గాయం తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం!
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) దేశవాళీ క్రికెట్ సీజన్‌లోని మల్టీడే మ్యాచ్‌ల కోసం 'సీరియస్ ఇంజురీ రీప్లేస్‌మెంట్' అనే సరికొత్త నిబంధనను పరిచయం చేసింది. ఈ నిబంధన వల్ల ఒక ఆటగాడు తీవ్రంగా గాయపడి మ్యాచ్ నుంచి వైదొలిగితే.. అతని స్థానంలో అదే తరహా నైపుణ్యం కలిగిన మరొక ఆటగాడిని తీసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత క్రికెటర్ రిషబ్ పంత్, ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ గాయపడినప్పటికీ, మ్యాచ్‌లలో కొనసాగాల్సి వచ్చిన సంఘటనల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిబంధనల ప్రకారం ఏ ప్లేయరైనా తీవ్రంగా గాయపడితే అతడి స్ధానంలో 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్' మరొకరిని తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకు బౌలర్ గాయపడితే బౌలర్, బ్యాటర్ గాయపడితే బ్యాటర్‌ను భర్తీ చేయవచ్చు. టాస్ వేసే ముందు ఆయా జట్లు నలుగురు ఆటగాళ్లతో కూడా జాబితాను అంపైర్లకు అందజేయాలి. ఎవరైనా ఆటగాడు గాయపడితే వారి నుంచే భర్తీ చేయాలి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. మ్యాచ్ రిఫరీకి తుది అధికారం ఉంటుంది. వైద్యుల సలహా మేరకు, గాయం తీవ్రతను అంచనా వేసి ప్రత్యామ్నాయాన్ని అనుమతిస్తారు. ఈ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయాన్ని పొందేందుకు కొన్ని ప్రత్యేకమైన షరతులు ఉన్నాయి.

'సీరియస్ ఇంజురీ రీప్లేస్‌మెంట్' రూల్స్
గాయం తీవ్రత: ఒక ఆటగాడికి మ్యాచ్ సమయంలో బంతి తగలడం వల్ల, ఫ్రాక్చర్ లేదా డిస్‌లొకేషన్ వంటి తీవ్రమైన గాయాలు సంభవించినప్పుడు, ఆ గాయం అతన్ని మ్యాచ్‌లో కొనసాగనీయని పరిస్థితిలో ఉంటే మాత్రమే ప్రత్యామ్నాయం అనుమతించబడుతుంది.
ఆన్‌ఫీల్డ్ అంపైర్ పాత్ర: మైదానంలో ఉన్న అంపైర్ మొదట గాయం తీవ్రతను పరిశీలిస్తారు. అవసరమైతే వారు మ్యాచ్ రిఫరీ, డాక్టర్ల సలహా తీసుకొని ప్రత్యామ్నాయానికి అనుమతి ఇస్తారు.
టీమ్ మేనేజర్ విధి: జట్టు మేనేజర్ గాయపడిన ఆటగాడి వివరాలతో ఒక ఫామ్‌ను మ్యాచ్ రిఫరీకి సమర్పించాలి. ఇందులో గాయం ఎప్పుడు, ఎలా జరిగిందనే సమాచారంతో పాటు, అతను ఇక మ్యాచ్‌ను కొనసాగించలేడని స్పష్టం చేయాలి. అంతేకాకుండా, ప్రత్యామ్నాయంగా తీసుకునే ఆటగాడు 'లైక్-ఫర్-లైక్' అంటే, గాయపడిన ఆటగాడి మాదిరిగానే అదే పాత్రలో (ఉదాహరణకు, బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాట్స్‌మెన్ స్థానంలో బ్యాట్స్‌మెన్) ఉండాలి.
ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపిక: ప్రత్యామ్నాయంగా తీసుకోవలసిన ఆటగాడిని, టాస్ సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచే ఎంపిక చేయాలి. ఒకవేళ వికెట్ కీపర్‌కు తీవ్ర గాయం అయితే, సబ్‌స్టిట్యూట్ లేని పక్షంలో బయటి నుంచి కొత్త వికెట్ కీపర్‌ను పిలిచేందుకు అనుమతి ఉంటుంది. ప్రత్యామ్నాయం జట్టుకు అన్యాయమైన లాభం ఇవ్వదని మ్యాచ్ రిఫరీ భావిస్తేనే దానిని అనుమతిస్తారు.
నిర్ణయం తుది అధికారం: మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఈ విషయంలో అంతిమం. ఏ జట్టు కూడా దానిపై అప్పీల్ చేసే హక్కు ఉండదు. గాయపడిన ఆటగాడిపై వర్తించే పెనాల్టీలు, హెచ్చరికలు, లేదా టైమ్ అవుట్ వంటివి ప్రత్యామ్నాయ ఆటగాడికి కూడా వర్తిస్తాయి. ఒకసారి ప్రత్యామ్నాయం అనుమతించబడితే, గాయపడిన ఆటగాడు తిరిగి మైదానంలోకి రాలేడు. గాయపడిన, ప్రత్యామ్నాయ ఆటగాడి గణాంకాలు మ్యాచ్ రికార్డులో ఉంటాయి.
ఇతర కొత్త నిబంధనలు
షార్ట్ రన్స్: బ్యాటింగ్ చేసే జట్టు ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్స్ తీసుకుంటే, ఆ తర్వాతి బంతిని ఏ బ్యాట్స్‌మెన్ ఎదుర్కోవాలో ఫీల్డింగ్ చేసే జట్టు నిర్ణయిస్తుంది. ఈ నిబంధన కేవలం ఐపీఎల్, బీసీసీఐ దేశీయ క్రికెట్‌లో మాత్రమే వర్తిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications