
తొలి పదేళ్లలో అలాగే నిర్వహించేవారు
ఐపీఎల్ ప్రారంభమైన మొదటి 10సంవత్సరాల(అంటే రెండు ప్రసారహక్కుల వ్యవధుల కాలం)లో తొలి బ్రాడ్ కాస్టింగ్ వ్యవధి(2008 - 2012), రెండో బ్రాడ్ కాస్టింగ్ సైకిల్ (2013- 2017)లో ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 4గంటలకు, రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యేవి. ఇక మూడో బ్రాడ్ కాస్టింగ్ (2018-2022) వ్యవధిలో స్టార్ స్పోర్ట్స్ ప్రసార హక్కులను రూ.16,347కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
స్టార్ స్పోర్ట్స్ అభ్యర్థన మేరకు బీసీసీఐ మ్యాచ్ ల టైమింగ్స్ ను అర్ధగంట ముందుకు జరిపింది. స్టార్ స్పోర్ట్స్ వాదన ప్రకారం.. రాత్రి 8గంటల కంటే 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తే.. ప్రైమ్ టైమ్‌లో అదనంగా 30నిమిషాల వ్యవధి లభిస్తుంది. తద్వారా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది, అలాగే మానిటైజేషన్ కూడా పెరుగుతుంది. అలాగే మధ్యాహ్నం మ్యాచ్‌లను కూడా 30నిమిషాలు ముందుగా మధ్యాహ్నం 3.30కు ప్రారంభించాలని కోరింది. అందుకు బీసీసీఐ సమ్మతించి మ్యాచ్ టైమింగ్స్‌ను మార్చి నిర్వహిస్తోంది.

ఐటీటీ పత్రాల కొనుగోలుకు రేపటి వరకు గడువు
మరోవైపు వచ్చే బ్రాడ్ కాస్టింగ్ సైకిల్ (2018 - 22)కోసం ప్రసార హక్కుల కోసం వేలం వేసేందుకు ఐటీటీ పత్రం కొనుగోలుకు బీసీసీఐ చివరి తేదీని 10రోజులు పొడిగించింది. ఆసక్తిగల పార్టీల నుండి వచ్చిన అభ్యర్థనలకు అనుగుణంగా ఐటీటీ పత్రాలను కొనుగోలు చేసే తేదీని మే 20, 2022వరకు పొడిగించింది. రేపటితో గడువు ముగియనుంది. ఐటీటీ పత్రాల కొనుగోలు విధానం, నాన్ రిఫండబుల్ ఫీజు తదితర వివరాలను ఎగ్జిబిట్లో బీసీసీఐ పేర్కొంది.

ఐపీఎల్ వారి పాట మామూలుగా ఉండదు
క్రిక్ బజ్ ప్రకారం.. ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంలో పాల్గొనడానికి స్టార్ ఇండియా, వయాకామ్ 18, సోనీ, అమెజాన్, జీ, డ్రీమ్ 11, సౌత్ ఆఫ్రికాలోని సూపర్‌స్పోర్ట్స్, UKలోని స్కై ఐటీటీ పత్రాన్ని కొనుగోలు చేశాయి. టైమ్స్ ఇంటర్నెట్ కూడా ఆసక్తిని చూపింది. టైమ్స్ ఇంటర్నెట్ అనుబంధ సంస్థ అయిన క్రిక్‌బజ్ ద్వారా ఐటీటీ పత్రాలు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
ఐటీటీ పత్రాలు కొనుగోలు చేసిన ప్రసారదారులు అందరూ బిడ్డింగ్‌లో పాల్గొంటారనే గ్యారెంటీ లేదు. ఇది కేవలం ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే. జూన్ 12న బిడ్డింగ్ జరుగుతుంది. బీసీసీఐ వేలంలో కనీస ధరను రూ.32,890కోట్ల భారీ ధరను నిర్ణయించింది. వేలం వేయాలనుకునే వారు అంతకుమించి పాటపాడాలి.


Click it and Unblock the Notifications












