న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వయస్సు విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

BCCI to impose 2-year ban on cricketers guilty of age fraud

న్యూ ఢిల్లీ: అసలే యువ క్రికెటర్ల కాంపిటేషన్‌కి తాళలేక సీనియర్లంతా జట్టుకు దూరమవుతున్న తరుణంలో బీసీసీఐ మరో షాకింగ్ న్యూస్‌ను తెరపైకి తీసుకొచ్చింది. వయసు నిబంధనలను ఉల్లంఘించే క్రికెటర్లపై బీసీసీఐ ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఆటగాడు ఇకపై తమ వయసు తప్పుగా చెప్పి మోసగిస్తే రెండేళ్ల పాటు బీసీసీఐ నిర్వహించే టోర్నీలు ఆడకుండా నిషేధం విధించనుంది.

బీసీసీఐ టోర్నీల్లో క్రికెటర్లపై కఠిన చర్యలు

బీసీసీఐ టోర్నీల్లో క్రికెటర్లపై కఠిన చర్యలు

‘క్రీడల్లో వయసుకు సంబంధించి మోసం చేసేవారిని బీసీసీఐ ఎంత మాత్రం సహించేదే లేదు. జనన ధ్రువీకరణ పత్రాల్లో తేదీల మార్పు చేసి, నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో బీసీసీఐ నిర్వహించే టోర్నీల్లో ఆడే క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఈ విషయాన్ని బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు తెలియజేసింది.

ఇదే క్రికెటర్‌పై ఏడాది పాటు నిషేధం

ఇదే క్రికెటర్‌పై ఏడాది పాటు నిషేధం

2018-19 సీజన్‌లో ఏ క్రికెటరైనా జనన ధ్రువీకరణ విషయంలో మోసం చేస్తే రెండేళ్ల (2018-18, 2019-20) పాటు నిషేధం విధిస్తామని పేర్కొంది. ఇంతకు ముందు ఓ క్రికెటర్‌ ఇదే నేరంపై ఏడాది నిషేధం అనుభవించాడు. అండర్‌-19 టోర్నీలో ఆడేందుకు మేఘాలయ‌కు చెందిన న్యూ ఢిల్లీ ఆటగాడు జస్కీరత్‌ సింగ్‌ నకిలీ జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో ఏడాది నిషేధం విధించారు. జూనియర్‌ క్రికెట్‌లో ఇలాంటి మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి.

రాహుల్‌ ద్రవిడ్‌ మూడేళ్ల క్రితమే

రాహుల్‌ ద్రవిడ్‌ మూడేళ్ల క్రితమే

జూనియర్‌ క్రికెట్‌లో వయసు సంబంధిత మోసాలు చాలా పెద్ద సమస్యగా మారిందని అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మూడేళ్ల క్రితమే ప్రస్తావించారు. ఇది చాలా ప్రమాదమైన పరిస్థితి అని కూడా వివరించారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఒక ఆటగాడిని ఒకే సారి ఆడించాలన్న నిబంధనను స్వాగతించారు.

మామూలుగా ఒకటి.. బీసీసీఐ ప్రకారం మరొకటి

మామూలుగా ఒకటి.. బీసీసీఐ ప్రకారం మరొకటి

కొద్ది నెలల ముందు షేన్ వార్న్ తన ఆత్మకథను 'నో స్పిన్' రూపంలో విడుదల చేశాడు. ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్‌తో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. అతని వయసెంత అని అడిగితే.. మామూలుగా అయితే ఒకటి. బీసీసీఐ లెక్కల ప్రకారం మరొకటి అని చెప్పాడని రాసుకొచ్చాడు. ఇక్కడే తెలుస్తోంది టీమిండియా క్రికెటర్ల వయస్సు లెక్కలు!!

Story first published: Wednesday, November 28, 2018, 8:55 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X