పూణె పిచ్ నాసిరకం: క్రిస్ బ్రాడ్ నివేదికపై మండిపడ్డ బీసీసీఐ
హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల తొలి టెస్టు జరిగిన పూణె పిచ్ నాసిరకమైనదంటూ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నివేదిక ఇవ్వడాన్ని బీసీసీఐ తీవ్రంగా తప్పుబట్టింది. పూణె టెస్టులో ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ 70 పరుగులిచ్చి 12 వికెట్లు తీయడంతో మూడు రోజులకే మ్యాచ్ ముగిసిన సంగతి తెలిసిందే.
టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందజేశారు. ఈ నివేదికలో తొలి టెస్టు జరిగిన పూణె పిచ్ నాసిరకమైనదిగా పేర్కొన్నారు. ఐసీసీ పిచ్, అవుట్ ఫీల్డ్ నిర్వహణకు సంబంధించిన క్లాజ్-3 ప్రకారం బ్రాడ్ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. ఐసీసీ ఈ నివేదికను బీసీసీఐకి పంపుతూ స్పందించేందుకు రెండు వారాల సమయమిచ్చింది.

పిచ్ రూపకల్పనలో ఏమాత్రం తప్పు జరగలేదు
దీంతో ఐసీసీ నివేదికపై బీసీసీఐ స్పందించింది. పూణె పిచ్ రూపకల్పనలో ఏమాత్రం తప్పు జరగలేదని పేర్కొంది. అసలు పూణె పిచ్ నాసిరకంగా ఉందని మ్యాచ్ రిఫరీ ఏ రకంగా నిర్దేశించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు పూణె పిచ్ నాసిరకం పిచ్ కాదని తన వాదనను గట్టిగా వినిపించింది.

పూణె పిచ్ నాసిరకం పిచ్ కాదు
'పూణె పిచ్ నాసిరకం పిచ్ కాదు. తొలి ఇన్నింగ్స్‌లో 260, రెండో ఇన్నింగ్స్‌లో 285 స్కోర్లు నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అసలు పూర్ పిచ్ అంటే అర్థమేమిటి' అని బీసీసీఐ సీనియర అధికారి ఒకరు నిలదీశారు.

మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిన మాట వాస్తవం
'మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిన మాట వాస్తవం. భారత్ స్వల్ప స్కోర్లకే పరిమితమైంది. అయితే ఆస్ట్రేలియా మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక్కడ ఏమైనా ఊహించని బౌన్స్ వచ్చిందా. బ్యాట్స్‌మన్లు తీవ్రంగా ఇబ్బంది పడటం పూణెలో జరిగిందా?' అని ఆయన ప్రశ్నించారు.

ఐసీసీ కావాలనే ఇలా చేస్తోంది
ఈ మధ్య కాలంలో ఐసీసీ భారత్‌లోని పిచ్‌లపై మాత్రమే దృష్టిసారిస్తుందని ఆయన తెలిపారు. డిసెంబర్, 2015 నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగియడంతో అప్పటి ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవుయి నాగ్‌పూర్ పిచ్‌ని నాసిరకమైనదంటూ నివేదిక ఇవ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు

క్రిస్ బ్రాడ్ నివేదికను తీవ్రంగా తప్పుబడుతోన్న బీసీసీఐ
తాజాగా పూణె పిచ్‌ను నాసిరకం పిచ్‌గా అభివర్ణిస్తూ నివేదిక ఇవ్వడాన్ని బీసీసీఐ తీవ్రంగా తప్పుబడుతోంది. ఐసీసీకి శుక్రవారం సమర్పించిన నివేదికలో బీసీసీఐ గట్టిగా నిలదీసింది. ఇది మ్యాచ్ రిఫరీ చెప్పినట్లు ఎంతమాత్రం పూర్(నాసిరకం) పిచ్ కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఐసీసీ ముందు ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications