Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ప్లేయర్స్‌‌కు డైమండ్ రింగ్స్.. బీసీసీఐ సడెన్ సర్‌ప్రైజ్!

గతేడాది వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందించింది. అయితే ఈ ప్రైజ్ మనీతో పాటు తాజాగా మరో విలువైన బహుమతిని కూడా అందించింది. జట్టులోని ప్రతీ ఆటగాడికి అత్యంత విలువైన డైమండ్ రింగ్స్ ను ప్రదానం చేసింది. అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

రీసెంట్ గా బీసీసీఐ.. నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ప్లేయర్స్ కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వజ్రపు ఉంగరాలను ప్రదానం చేసింది. తాజాగా ఈ ప్రదానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ప్రత్యేకంగా విడుదల చేసింది. "టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియాకు ఛాంపియన్స్ రింగ్ ను ప్రదానం చేస్తున్నాం. ఈ వజ్రాలు శాశ్వతంగా ఉండవచ్చు, కానీ ఈ విజయం కచ్చితంగా బిలియన్ల మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని బీసీసీఐ పేర్కొంది.

BCCI honours rohit sharma T20 worldcup winners with Champions diamond ring

ఈ ఉంగరాలను వజ్రాలు, బంగారంతో రూపొందించారు. అలానే ఈ ఉంగరంపై భాగంలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌ ఇండియా అనే అక్షరాలను లిఖించారు. దీంతో పాటే అశోక చక్రం గుర్తు కూడా వేశారు. ఇంకా ఉంగరానికి రెండు వైపులా ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నంబర్లతో పాటు భారత జట్టు ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాలు సాధించిందో కూడా ముద్రించారు. వీడియోలో రోహిత్ శర్మ, బుమ్రా, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ ఉంగరాలను స్వీకరించినట్లు కనపడుతోంది. కాగా, టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి టైటిల్ ను ముద్దాడింది.

వాటి నుంచి స్ఫూర్తి పొంది..
అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్‌బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ ఛాంపియన్స్ రింగ్ కల్చర్ ను ప్రారంభించింది బీసీసీఐ. ఎన్‌బీఏ తమ ఛాంపియన్స్ కు రింగ్ ప్రదానం చేసి సత్కరిస్తోంది. 1947 నుంచి ఈ ఆనవాయితినీ కొనసాగిస్తోంది. ప్రతీ సీజన్ లో సూపర్ బౌల్ విన్నర్స్ కు ఈ ప్రత్యేకమైన రింగ్ లను అందిస్తుంది.

Story first published: Saturday, February 8, 2025, 7:09 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+