Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఐసీసీ తర్వాత బీసీసీఐనే

BCCI hits 6 million followers on Twitter, celebrates it with simple tweet

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ మరో అరుదైన ఘనత సాధించింది. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌‌లో బీసీసీఐ దూసుకుపోతోంది. బీసీసీఐ ట్విటర్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లను అందుకుంది. ఏ దేశ క్రికెట్‌ బోర్డుకు ఇంతటి స్థాయిలో అభిమానులు లేరు.

ఒక్క ఐసీసీకి మాత్రమే బీసీసీఐ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఐసీసీకి 6.89మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 6 మిలియన్ల మంది ఫాలోవర్లు చేరిన సందర్భంగా '6 మిలియన్ల మందితో మన కుటుంబం మరింత బలపడింది. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు' అంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

ఏ బోర్డుకు ఎంత మంది ఫాలోవర్లు:
1. India (@BCCI) - 6m
2. Bangladesh (@BCBtigers) - 1.75m
3. Pakistan (@TheRealPCB) - 1.1m
4. South Africa (@OfficialCSA) - 899k
5. Sri Lanka (OfficialSLC) - 589k
6. England (@englandcricket) - 428k
7. New Zealand (@BLACKCAPS) - 363k
7. West Indies (@westindies) - 243k
8. Zimbabwe ( @ZimCricketv) - 193k
9. Australia (@CAComms) - 171k
10. Afghanistan (@ACBofficials) 166k

ఇదిలా ఉంటే బీసీసీఐ మహిళల క్రికెట్‌ జట్టుకు, దేశవాళీ క్రికెట్‌ కోసం అదనంగా మరో రెండు ట్విటర్‌ ఖాతాలను నిర్వహిస్తోంది. బీసీసీఐ మహిళల ట్విటర్‌ ఖాతాకు 96వేలు, బీసీసీఐ దేశవాళీ ఖాతాకు 2 లక్షల 18వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, ఆటగాళ్ల విషయానికి వస్తే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అత్యధికంగా 21.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 20.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Story first published: Saturday, November 18, 2017, 13:51 [IST]
Other articles published on Nov 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+