IPL 2022: మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితా విడుదల.. ఎంత మందంటే?

ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం 1214 మంది ఆటగాళ్లు వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా.. అందులో 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. షార్ట్ లిస్ట్ చేసిన 590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. అలాగే ఇందులో 370 మంది భారత ఆటగాళ్లు కాగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఏ దేశం నుంచి ఎంత మంది?
వేలంలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల సంఖ్య ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా ఉంది. అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత వెస్టిండీస్ నుంచి 34 మంది, దక్షిణాఫ్రికా నుంచి 33 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ నుంచి 24 మంది చొప్పున, శ్రీలంక నుంచి 23 మంది, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 17 మంది వేలంలో పాల్గొంటున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు, నమీబియా నుంచి ముగ్గురు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు వేలంలో తమ లక్ పరీక్షించుకోనున్నారు. జింబాబ్వే నుంచి ఒకరు, నేపాల్ నుంచి ఒకరు, , అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏ ప్రైజ్‌లో ఎంత మంది?
మెగా వేలం 2 కోట్ల రూపాయల జాబితాలో మొత్తం 48 మంది ఆటగాళ్లు ఉన్నారు. కోటిన్నర జాబితాలో 20 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక 34 మంది ఆటగాళ్లు ఒక కోటి రూపాయలను తమ బేస్ ప్రైస్‌గా పేర్కొన్నారు.

వేలం ఎప్పుడంటే?
ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరో వైపు జట్లు కూడా వేలం కోసం తమ కసరత్తులు ఇప్పటికే ప్రారంభించాయి. కాగా వేలం కోసం ఒక్కో జట్లు దగ్గర 90 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇప్పటికే రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో కలిపి ఈ 90 కోట్ల రూపాయలను ఆయా జట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి.

వేలంలో ఉన్న పలువురు భారత స్టార్ ఆటగాళ్లు
వేలంలో పలువురు టీమిండియా స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరి కోసం వేలంలో జట్ల మధ్య పోలీ నెలకొనే అవకాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి భారత ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications