Womens IPL: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్.. ఆమోదం తెలిపిన బీసీసీఐ..

ముంబైలో మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఆమోదం తెలిపింది. సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ నియామకంతో సహా AGM సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. "ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి జనరల్ బాడీ ఆమోదించింది" అని BCCI నుండి ఒక ప్రకటన విడుదల చేసింది.
18 మంది ఆటగాళ్లు
మహిళల IPL మొదటి సీజన్‌ను వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే అవకాశం ఉందని గతంలో వివిధ పలు మీడియా నివేదికలు తెలిపాయి. ఉమెన్స్ ఐపీఎల్ లో ఐదు జట్లు ఉంటాయని తెలుస్తోంది. మహిళా ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో 2023 మహిళల T20 ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ESPNcricinfo ప్రకారం, ప్రతి జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉంటారట. ఇందులో గరిష్టంగా ఆరుగురు విదేశీ వారిని తీసుకొవచ్చట.
ఐసీసీ ఛైర్మన్
ఈ ఐదుగురు ఆటగాళ్లలో ఒకరు తప్పనిసరిగా అసోసియేట్ దేశానికి చెందినవారు అయి ఉండాలట. ఈ సీజన్‌లో 22 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో మెల్‌బోర్న్‌లో జరగనున్న బోర్డు సమావేశంలో ఎంపికయ్యే ఐసీసీ ఛైర్మన్ పదవికి బీసీసీఐ ఎవరిని నామినేట్ చేయడం లేదు. నామినేట్ చయడానికి అక్టోబర్ 20 వరకు గడువు ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications