Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ పేరు ఖ‌రారు.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న‌

BCCI has finalized the name of Rohit Sharma as Team Indias Test captain

విరాట్ కోహ్లీ త‌ర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవ‌ర‌ని నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠ‌కు బీసీసీఐ ఇక తెర‌దించ‌నుందా? ఇప్ప‌టికే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌ను సెల‌క్ష‌న్ క‌మిటీ ఖ‌రారు చేసిందా? త్వ‌ర‌లోనే టీమిండియా నూత‌న టెస్ట్ సార‌థిని బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుందా? అంటే అంత‌టా అవున‌నే స‌మాధానామే వినిపిస్తోంది. బీసీసీఐ ఇప్ప‌టికే టెస్ట్ కెప్టెన్‌ను ఖారారు చేసింద‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించనుంద‌ని జాతీయ మీడియా వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది.

హిట్‌మ్యాన్‌కే బాధ్య‌త‌లు

హిట్‌మ్యాన్‌కే బాధ్య‌త‌లు

ఇప్ప‌టికే వ‌న్డే, టీ20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మకే టెస్ట్ కెప్టెన్సీ కూడా అప్ప‌గించాల‌ని సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణ‌యించింద‌ని బీసీసీఐ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించనుంద‌ని తెలుస్తోంది. టీమిండియాకు ఇద్ద‌రు కెప్టెన్లు ఉండ‌డం చాలా అరుదు క‌నుక, అదే ప‌ద్ద‌తిని బీసీసీఐ ఇప్పుడు కూడా పాటించనుంద‌ని స‌మాచారం. ఎందుకు అంటే టీమిండియాకు ఇద్ద‌రు కెప్టెన్లు ఉంటే జ‌ట్టులో స‌మ‌తుల్యం దెబ్బ తింటుంద‌ని గ‌తంలో రుజువైంద‌ని బీసీసీఐ భావించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే రోహిత్ పేరే ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

రోహిత్‌కు క‌లిసొచ్చిన అంశాలు

రోహిత్‌కు క‌లిసొచ్చిన అంశాలు

టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను నియ‌మించ‌డానికి అత‌నికి ప‌లు అంశాలు క‌లిసొచ్చాయ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు. అందులో ప్ర‌ధానంగా టీమిండియాకు ఇద్ద‌రు కెప్టెన్లు ఉండే సంప్ర‌దాయం లేక‌పోవ‌డం, కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌కు మంచి రికార్డులు ఉండ‌డం కార‌ణంగా చెబుతున్నారు. దీనికి తోడు రానున్న రెండేళ్లలో రెండు ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ‌క‌ప్‌లు ఉండ‌డంతో అనుభ‌వ‌జ్ఞుడైన రోహిత్ శ‌ర్మ‌నే అన్ని ఫార్మాట్ల‌లో కెప్టెన్‌గా ఉంటే బాగుంటుంద‌ని సెలెక్ట‌ర్లు భావించిన‌ట్లు తెలుస్తోంది.

వారికి ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణాలు

వారికి ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణాలు

టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌శ‌ర్మ‌తో పాటు ప‌లువురి పేర్లు కూడా ప‌రిశీల‌నకు వ‌చ్చాయ‌ని సమాచారం. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఫేల‌వంగా ఉండ‌డంతో అత‌డి పేరును తొల‌గించిన‌ట్టు సమాచారం. ఇక రిష‌బ్ పంత్ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంద‌ని భావించార‌ని తెలుస్తోంది. బుమ్రా కూడా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంద‌ని సెలెక్ట‌ర్లు అనుకున్నార‌ని స‌మాచారం. వీరికి మ‌రింత అనుభ‌వం అవ‌స‌ర‌మ‌ని, అందుకే అనుభ‌వ‌జ్ఞుడైన రోహిత్ శ‌ర్మ‌కే ఇవ్వ‌డం బెట‌ర‌ని సెలెక్ట‌ర్లు భావించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే

ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన త‌ర్వాత శ్రీ‌లంక‌తో స్వ‌దేశంలో టీమిండియా 2 టెస్టులు, 3 టీ20 లు ఆడాల్సి ఉంది. ఆ సిరీస్‌కు ముందే రోహిత్ శ‌ర్మ‌ను టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సమాచారం. కాగా శ్రీ‌లంక సిరీస్ మొద‌ట టెస్టుల‌తో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ శ్రీ‌లంక అభ్య‌ర్థ‌న మేర‌కు బీసీసీఐ మొద‌ట టీ20 సిరీస్ నిర్వ‌హించ‌నుంది. ఈ టీ20లు ఫిబ్ర‌వ‌రి 24, 26, 27వ తేదీల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇక మార్చి 3 నుంచి తొలి టెస్టు, 12 నుంచి రెండో టెస్ట్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Story first published: Tuesday, February 8, 2022, 22:03 [IST]
Other articles published on Feb 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+