Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women Cricket: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. పురుష క్రికెటర్లతో పాటు మహిళలకు సమాన మ్యాచ్ ఫీజు..

BCCI has decided to pay equal match fee to male cricketers as well as female cricketers

ఎప్పటి నుంచో వివక్ష ఎదుర్కొంటున్న మహిళలు నవీన యుగంలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. ఇంట్లో పనులు చూసుకోవడంతో పాటు ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో సమానంగా పని చేస్తూ తామేమీ తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నారు. ఉద్యోగంలోనే కాదు.. ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభ కనబరస్తున్నారు. తాజాగా మహిళ క్రికెటర్ల ప్రతిభ గుర్తించిన బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.

జై షా

దేశంలో అత్యధిక మంది ఇష్టపడే క్రికెట్ ఆటలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గురువారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా కాంట్రాక్ట్‌లో ఉన్న భారత మహిళా క్రికెటర్లకు "పే ఈక్విటీ పాలసీ"ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఒకే విధంగా ఉంటుంది.

రూ.15 లక్షలు

రూ.15 లక్షలు

"బీసీసీఐ వివక్షను రూపుమాపడంలో మొదటి అడుగు అని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మా కాంట్రాక్ట్ BCCI మహిళా క్రికెటర్లకు మేము పే ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నాము. పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఉంటుంది" అని జై షా ట్వీట్ చేశారు. భారత మహిళా క్రికెటర్లకు వారి పురుష సహచరులతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని ఆయన తెలిపారు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కోసం, రుసుము వరుసగా రూ.15 లక్షలు, వన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌కి రూ.6 లక్షలు, T20 మ్యాచ్‌కి రూ.3 లక్షలు చెల్లిస్తామన్నారు.

మహిళలను ప్రోత్సహిస్తుంది

క్రికెటర్లకు "పే ఈక్విటీ పాలసీ"కి సంబంధించి బీసీసీఐ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. "బీసీసీఐ ఇతర క్రీడా సంస్థలకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించింది. ఇది ఆటలో మహిళలు ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నిజంగా ఒక చారిత్రాత్మక మైలురాయి!" అని దిగ్గజ రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ ట్విట్టర్‌లో రాశాడు.

మిథాలీ రాజ్

భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బీసీసీఐ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప రోజని చెప్పారు. " భారతదేశంలో మహిళల క్రికెట్‌కు ఇది చారిత్రాత్మక నిర్ణయం! వచ్చే ఏడాది WIPLతో పాటు పే ఈక్విటీ పాలసీ, మేము భారతదేశంలో మహిళా క్రికెట్‌కు కొత్త శకానికి నాంది పలుకుతున్నాం. ధన్యవాదాలు జై షా సర్,

దీన్ని సాకారం చేసినందుకు బీసీసీఐ. ఈ రోజు నిజంగా సంతోషంగా ఉంది" అని ట్వీట్ చేశారు.

Story first published: Thursday, October 27, 2022, 15:03 [IST]
Other articles published on Oct 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+