టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. గతేడాది చివర్లో యాక్సిడెంట్‌కు గురైన పంత్.. శస్త్రచికిత్సల అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అతనితోపాటు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఎన్సీయేలోనే ఉన్నారు.
వీరందరి ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్లేయర్ల రిహాబిలేషన్‌పై బీసీసీఐ మెడికల్ టీం సంతృప్తి కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రా, ప్రసిద్ధ్ ఇద్దరూ కూడా దాదాపు కోలుకున్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ నెట్స్‌లో ఫుల్ ఇంటెన్స్ బౌలింగ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. కొన్నిరోజుల్లో ఎన్సీయే ఆధ్వర్యంలో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తారట.

ఈ మ్యాచ్‌లో బుమ్రా, కృష్ణ బౌలింగ్ చూసిన తర్వాత వీరి రీఎంట్రీపై ఒక నిర్ణయానికి వస్తారట. ఇక కీలకమైన రిషభ్ పంత్ విషయంలో కూడా బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. పంత్ కూడా చాలా వరకు కోలుకున్నాడని, ప్రస్తుతం బ్యాటింగ్, కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. అతని కోసం ప్రత్యేకంగా స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, రన్నింగ్‌తో ప్రత్యేకమైన ఫిట్‌నెస్ ప్రోగ్రాం రెడీ చేశామని, పంత్ దాన్ని చక్కగా ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది.
ఇక బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టేశారట. వాళ్లు ఫిట్‌నెస్ డ్రిల్స్‌లో చక్కగా పాల్గొంటున్నారని తెలిపిన మెడికల్ టీం.. వాళ్ల రికవరీపై సంతృప్తి వ్యక్తం చేసిందిట. మరికొన్ని రోజుల్లో వాళ్ల ట్రైనింగ్ ఇంటెన్సిటీని పెంచుతామని తెలిపింది. ప్రస్తుతం అంచనాల ప్రకారం బుమ్రా వచ్చే ఐర్లాండ్ సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్లందరూ కూడా ఆసియా కప్ నాటికి రెడీ అవ్వొచ్చని సమాచారం.