ధావన్‌ను పక్కకు నెట్టేసిన బీసీసీఐ.. ఫిట్‌నెస్ సాధించాడని కేఎల్ రాహుల్‌కు పగ్గాలు

కేఎల్ రాహుల్ గురువారం ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. తద్వారా జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఆడేందుకు అతను బీసీసీఐ నుంచి అనుమతి పొందాడు. అంతకుముందు బీసీసీఐ ఈ సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ కోలుకోవడంతో బీసీసీఐ ఇప్పుడు రాహుల్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. ధావన్‌ను కెప్టెన్సీ నుంచి పక్కను నెట్టేసింది. రాహుల్ డిప్యూటీగా ధావన్‌ను నియమించింది. ఈ సిరీస్‌కు 15మంది సభ్యులతో కూడిన భారత జట్టులో రాహుల్‌ను సెలెక్షన్ కమిటీ చేర్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు రాహుల్ కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ తర్వాత గాయాలు, ఆపరేషన్, ఫిట్ నెస్, కరోనా తదితర కారణాల వల్ల వరుసగా టీమిండియా ఆడిన పలు సిరీస్లకు దూరమయ్యాడు.
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు
టాపార్డర్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్,
మిడిలార్డర్ : దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్,
లోయర్ ఆర్డర్ ఆల్రౌండర్లు : వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్,
టెయిలెండర్లు (బౌలర్లు) : కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
జింబాబ్వే పర్యటన మ్యాచ్‌ల బ్రాడ్ కాస్టింగ్, టైమింగ్
ఈ సిరీస్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను సోనీ చానెల్స్‌తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్ దక్కించుకున్నాయి. భారత ప్రభుత్వ ఛానెల్ దూరదర్శన్ స్పోర్ట్స్‌లో కూడా మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. డీడీ స్పోర్ట్స్ చానెల్‌ను ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఫ్రీగా చూడాలంటే మాత్రం జియో టీవీ, ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లు ఉండాలి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభం కానున్నాయి.

జింబాబ్వేలో భారత జట్టు వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే: గురువారం, ఆగస్టు 18, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
రెండవ వన్డే: శనివారం, ఆగస్టు 20, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
మూడో వన్డే: సోమవారం, ఆగస్టు 22, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications