బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూత.. గంగూలీ, జైషా నివాళి సందేశాలు

బీసీసీఐ మాజీ సెక్రెటరీ అమితాబ్ చౌదరి గుండెపోటులో హఠాన్మరణం చెందారు. రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అమితాబ్ చౌదరి.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన హయాంలో జార్ఖండ్‌కు ఫస్ట్-క్లాస్ హోదా వచ్చింది. జార్ఖండ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా రావడంలో అమితాబ్ చౌదరి కీలకపాత్ర పోషించారు. జార్ఖండ్ రాష్ట్రానికి ఫస్ట్ క్లాస్ హోదా వచ్చిన తర్వాత ఎంఎస్ ధోనీ బీహార్ నుంచి జార్ఖండ్ టీంకు మారాడు. రాంచీలో ప్రపంచస్థాయిలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని నిర్మించడంలో అమితాబ్ చౌదరి ఎంతో చొరవ కనబరిచారు. విరాట్ కోహ్లి, భారత మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తినప్పుడు అమితాబ్ చౌదరి ఆ విషయంలో కలగజేసుకుని సద్దుమణిపించారు.

చాపెల్, గంగూలీ మధ్య వాగ్వాద టైంలో..
ఇకపోతే భారత టీమ్ మేనేజర్‌గా అమితాబ్ చౌదరి పనిచేస్తున్న సమయంలో మాజీ ప్రధాన కోచ్ గ్రెగ్ చాపెల్‌తో బహిరంగంగా అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇక గంగూలీని శాంతించేలా చేయడంలోనూ ఆ వివాదాన్ని మరింత జటిలం కాకుండా చూడ్డాంలోనూ అమితాబ్ చౌదరి క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సౌరవ్ గంగూలీ.. దివంగత అమితాబ్ చౌదరి మరణవార్త తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యాడు.

రాంచీలో ఇప్పుడు ప్రపంచస్థాయి స్టేడియం ఉందంటే..?
‘మిస్టర్ అమితాబ్ చౌదరి విచారకరమైన మరణవార్త గురించి తెలుసుకుని నేను షాకయ్యాను. చాలా విచారించాను. నాకు ఆయనతో సుదీర్ఘ అనుబంధం ఉంది. మా మీటింగ్స్ ఎప్పుడూ ఫలప్రదంగా సాగేవి. నేను ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు జింబాబ్వే పర్యటనలో నేను అతన్ని మొదట కలుసుకున్నాను. అప్పుడు ఆయన మా టీం మేనేజర్. కాలక్రమేణా మా మధ్య చర్యలు సాగేవి. క్రీడ పట్ల అతని అభిరుచి స్పష్టంగా కనిపించింది. నేడు రాంచీలో ప్రపంచ స్థాయి స్టేడియాన్ని మనం కలిగి ఉన్నామంటే ఇదంత ఆయన విజన్.. అనితర ప్రయత్నానికి లభించిన ఫలితమే' అని గంగూలీ పేర్కొన్నాడు.


‘ఆయన వల్ల జార్ఖండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ త్వరితగతిన ప్రగతి
పథంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది క్రికెటర్లు భారత్ తరఫున ఆడినప్పుడు ఆయన ఆత్మ మరింత సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ విచార సమయంలో ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని గంగూలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ జై షా సైతం స్పందిస్తూ.. ‘మిస్టర్ అమితాబ్ చౌదరి మరణవార్త విని నేను షాకయ్యాను. క్రికెట్ అట్టడుగు స్థాయిలో నిజమైన మార్పు తీసుకురావాలని అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ఆయన నాయకత్వంలో నిజమైన పరివర్తనను చూశాం. ఆయన ఆత్మ శాంతించుగాక' అంటూ నివాళులర్పించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications