వరుణ్ చక్రవర్తికి బీసీసీఐ బిగ్ షాక్!
KKR vs CSK: ఐపీఎల్ 2025లో బుధవారం రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఐదు సార్లు ఐపీఎల్ విజేతలు అయిన చెన్నె సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా సీఎస్కే కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత కష్టతరం చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి బీసీసీఐ జరిమానా విధించింది.
అద్భుతంగా రాణించినప్పటికీ జరిమానా తప్పలే..
బుధవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత వరుణ్ చక్రవర్తికి జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రకారం.. వరుణ్ చక్రవర్తి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లెవెల్ 1 నేరాన్ని అంగీకరించాడు. వరుణ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించారు.

2 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ వరుణ్ చక్రవర్తిని తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 18 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.
2 వికెట్ల తేడాతో గెలిచిన సీఎస్కే
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే తరఫున నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి గరిష్టంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications