భారత జట్టు కోచ్ గా గ్యారీ పేరు దాదాపు ఖరారు
భారత క్రికెట్ జట్టు కోచ్ గా గ్యారీ కిర్ స్టెన్ ఎంపిక దాదాపు ఖరారు అయింది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. మాజీ ఓపెనర్ గ్యారీ కిర్ స్టెన్ లెఫ్ట్-హ్యాండ్ ఓపెనర్ గా దక్షిణాఫ్రికా జట్టుకు తన విశేష సేవలను అందించారు. 1967లో కేప్ టౌన్ లో జన్మించిన గ్యారీ కిర్ స్టెన్ 101 టెస్య్ మ్యాచ్ లు ఆడి 45.27 సగటుతో 7289 పరుగులు చేశాడు. టెస్ట్ లలో వ్యక్తిగత అత్యధిక స్కోరు 275 పరుగులు. 185 వన్డేలు ఆడి 40.95 సగటుతో 6798 పరుగులు చేశాడు. వన్డేలలో వ్యక్తిగత అత్యధిక స్కోరు 188(నాటౌట్). 1993లో ఆస్ట్రేలియాపై మెల్ బోర్న్ లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. వన్డేలలోనూ ఆస్ట్రేలియాపైనే 1993లోనే సిడ్నీలో తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. 2003లో శ్రీలంకతో డర్బన్ లో చివరి వన్డే ఆడగా, 2004లో వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ పై చివరి టెస్ట్ ఆడాడు. వారియర్స్ క్లబ్ కు కన్సల్టెంట్ కోచ్ గా వ్యవహరిస్తూనే కేప్ టౌన్ లో సొంత అకాడమీని 2006లో ప్రారంభించాడు.
Story first published: Saturday, December 1, 2007, 23:53 [IST]
Other articles published on Dec 1, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications