Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తటస్థ వేదికల ప్రయోగం ఫ్లాప్‌: పాత ఫార్మెట్లోనే రంజీ ట్రోఫీ

హైదరాబాద్: రంజీ ట్రోఫీలో వివాదాస్పదమైన తటస్థ వేదికల ఫార్మాట్‌ను బీసీసీఐ స్వస్తి పలికింది. వివాదాస్పదంగా మారిన ఈ విధానానికి స్వస్తి పలికిన బీసీసీఐ మళ్లీ పాత పద్ధతిలోనే దేశవాళీ టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో తటస్థ వేదికల్లో రంజీ ట్రోఫీ ఒక్క సీజన్‌కే పరిమితమైంది.

తటస్థ వేదికలపై అభ్యంతరాలు

తటస్థ వేదికలపై అభ్యంతరాలు

ప్రయోగాత్మకంగా చేపట్టిన తటస్థ వేదిక ఫార్మాట్‌పై జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు, కోచ్‌లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్‌ 6 నుంచి ఆరంభమయ్యే 2017-18 సీజన్‌ను పాత ఫార్మాట్‌లోనే నిర్వహించాలని మంగళవారం జరిగిన సమావేశంలో సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ టెక్నికల్‌ కమిటీ నిర్ణయించింది.

ఈ సీజన్‌లో నాలుగు గ్రూపులు

ఈ సీజన్‌లో నాలుగు గ్రూపులు

దీంతో పాటు 28 జట్లను మూడుకు బదులు నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఏడు జట్లు ఉంటాయి. అయితే నాకౌట్‌ మ్యాచ్‌లు ఎప్పటిలాగే తటస్థ వేదికల్లో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చెప్పాడు. ఇక, దులీప్‌ ట్రోఫీలో ‘గులాబీ బంతి' ప్రయోగం కొనసాగుతుందని చెప్పాడు.

అభిమానులు ఆనాసక్తి

అభిమానులు ఆనాసక్తి

తటస్థ వేదికల్లో ఆడటం వల్ల ప్రయాణానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. స్థానిక జట్టు లేకపోవడంతో అభిమానులు కూడా స్టేడియాలకు రావడానికి ఆసక్తి ప్రదర్శించలేదనే ప్రతికూల స్పందన వచ్చింది. దీంతో పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సౌరవ్ గంగూలీ చెప్పాడు.

రంజీ ట్రోఫీలో మొత్తం జట్లు 28

రంజీ ట్రోఫీలో మొత్తం జట్లు 28

చత్తీస్‌గఢ్‌ కూడా చేరడంతో మొత్తం రంజీ జట్ల సంఖ్య 28కి చేరింది. గతేడాది మూడు గ్రూప్‌లు ఉండగా... ఎ, బి గ్రూపుల్లో తొమ్మిది, సి గ్రూప్‌లో 10 జట్లకు స్థానం కల్పించారు. కానీ ఈ సీజన్‌లో నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఏడు జట్టులు ఆరు లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+