Virat Kohli : కోహ్లీ అడిగితే కెప్టెన్సీ లాగేసుకున్నారు.. ఇప్పుడు అదే ఆలోచన చేస్తున్న బీసీసీఐ!

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శనతో టీమిండియాపై అభిమానుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. సెమీఫైనల్ వరకు బాగానే ఆడిన జట్టు నాకౌట్ మ్యాచులో పూర్తిగా చేతులెత్తేయడం అందర్నీ నిరాశపరిచింది. దీంతో జట్టులో సమూల మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా నెగ్గాలనే ఆలోచనతో పొట్టి ఫార్మాట్‌లో జట్టులో మార్పులు, చేర్పులు చేస్తోంది.

సెలెక్టర్ల బృందంపై వేటు
అదే సమయంలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌తోపాటు న్యూజిల్యాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌లపై విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని కూడా సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ నయా యాజమాన్యం.. సెలెక్టర్ల బృందంపై వేటు వేసింది. సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సహా మొత్తం టీంను తొలగించేసి, కొత్త వారి కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.

కొత్త సెలెక్టర్లతో కొత్త రూల్స్
ప్రస్తుతానికైతే బంగ్లా పర్యటనకు కూడా టీమిండియా ఎంపిక పూర్తయింది. ఆ తర్వాత సిరీస్‌లకు కొత్త బృందమే జట్టును ఎంపిక చేస్తుంది. ఈ కొత్త సెలెక్టర్లతోపాటు కొత్త రూల్స్ కూడా తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తోందట. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీ20లకు, వన్డేలకు వేరు వేరు కెప్టెన్లను నియమించాలని భావిస్తోందట. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్య, వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మను కెప్టెన్లుగా కొనసాగించాలని అనుకుంటోందట.

అప్పుడు వద్దంటే వద్దన్నారు!
సరిగ్గా ఏడాది క్రితం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే అడిగాడు. పొట్టి ఫార్మాట్‌లో తను కెప్టెన్‌గా ఉండనని, కానీ వన్డేలకు కెప్టెన్సీ చేస్తానని చెప్పాడు. టెస్టుల్లో కూడా అప్పుడు కోహ్లీనే కెప్లెన్‌గా రాణిస్తున్నాడు. కానీ సెలెక్టర్లు, బీసీసీఐ దానికి ఒప్పుకోలేదు. అంతమంది కెప్టెన్లు వద్దంటూ కోహ్లీ చేతుల్లో నుంచి వన్డే కెప్టెన్సీని బలవంతంగా లాగేసుకున్నారు. ఇప్పుడు కోహ్లీ సజెషన్‌నే ఫాలో అయ్యేందుకు సిద్ధమవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications