హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించినట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై బీసీసీఐ స్పందించింది. టీమిండియా ప్రధాన కోచ్ ఎంపికపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని, రవిశాస్త్రిని నియమించారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది.

టీమిండియా ప్రధాన కోచ్ ఎంపికపై త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి పేర్కొన్నారు. అంతకముందు మంగళవారం సాయంత్రం టీమిండియా ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లే రవిశాస్త్రిని నియమించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.