లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ ప్రత్యేక కమిటీ
హైదరాబాద్: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపాడు. సోమవారం సమావేశమైన ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
'లోధా కమిటీ సూచించిన సంస్కరణలను పూర్తిగా అమలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఎంత త్వరగా, అత్యుత్తమంగా అమలు చేయొచ్చో విశ్లేషించేందుకు ఐదు లేదా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తాం' అని అమితాబ్ చౌదరి చెప్పాడు. కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నాడు.

ఒక రాష్ట్రానికి ఒక ఓటు
లోధా సిఫార్సుల్లోని ఒక రాష్ట్రానికి ఒక ఓటు, అధికారులకు 70 ఏళ్ల వయోపరిమితి, వరుసగా రెండు పర్యాయాలు పాలక మండలిలో ఉంటే కొనసాగితే, ‘కూలింగ్ పీరియడ్'గా పిలిచే మూడేళ్ల విశ్రాంతి, ప్రస్తుతం ముగ్గురు సభ్యులతో ఉన్న జాతీయ సెలక్షన్ కమిటీని ఐదుగురు సభ్యులతో పునర్వ్యవస్థీకరించడం లాంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులు
ఈ ప్రత్యేక కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఉంటారని ఆయన తెలిపాడు. ఇందులో భాగంగా ఏమైనా సమస్యలుంటే సీఓఏ ముందుకు ఈ కమిటీ తీసుకొస్తుందని అమితాబ్ తెలిపాడు. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల వ్యవహారం ప్రస్తుతం బోర్డు చేతుల్లో లేదని స్పష్టం చేశాడు. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కాబట్టి, బీసీసీఐ స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కుదరదని చెప్పాడు.

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై ఇలా
2014లో కుదిరిని ఒప్పందాన్ని అనుసరించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులతో సమావేశమవుతున్నామని, అయితే, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలా లేదా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. రాజస్తాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ)పై నిషేధాన్ని ఎత్తివేసే విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, బీసీసీఐపై వేసిన కేసులను వాపసు తీసుకుంటేనే ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తామని చెప్పాడు.

ఈ సమావేశానికి హాజరైన మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్
గౌహతిలో ఇటీవల నిర్మించిన స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నాడు. త్వరలోనే అక్కడ మ్యాచ్‌లు జరుగుతాయని అమితాబ్ చౌదరి తెలిపాడు. ఈ సమావేశానికి బోర్డు వివాదాస్పద మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా హాజరయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications