Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మహిళల టీ20 ఛాలెంజ్' షెడ్యూల్ ఇదే

BCCI confirms three team Womens T20 challenge League

ఐపీఎల్ తరహాలో టీ20 ఫార్మాట్‌ను మహిళల క్రికెట్‌కు కూడా బీసీసీఐ పరిచయం చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం మహిళల తొలి ఐపీఎల్ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ వాంఖెడే స్టేడియంలో జరిగింది. భారత మహిళా ఆటగాళ్లు స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌-సూపర్‌నోవాస్‌ జట్ల మధ్య ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరిగింది.

అయితే ఈ సంవత్సరం మహిళల టీ20 ఛాలెంజ్‌లో బీసీసీఐ మరో జట్టును అదనంగా జోడించింది. మహిళల టీ20 ఛాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌ జట్లతో పాటు వెలాసిటీ జట్టు కూడా ఆడనుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మిథాలీ రాజ్, స్మృతి మంధానాలు మూడు జట్లకు సారధ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

మూడు జట్లు మరో రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అనంతరం మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. మొత్తంగా ఈ లీగ్ నాలుగు మ్యాచ్‌లతో ముగుస్తుంది. మే 6న మొదలై.. మే 11తో ఈ లీగ్ ముగుస్తుంది. అన్ని మ్యాచ్‌లు జైపూర్ వేదికగా జరగనున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

Schedule:

May 6 - Supernovas vs Trailblazers

May 8 - Trailblazers vs Velocity

May 9 - Supernovas vs Velocity

May 11 - Final

Story first published: Wednesday, April 24, 2019, 17:37 [IST]
Other articles published on Apr 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+