
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత బీసీసీఐ ఇప్పుడు తన దృష్టిని టీమిండియా ఆడబోయే సిరీస్‌ల మీద పెట్టింది. టీమిండియా జూన్ 9నుంచి దక్షిణాఫ్రికాతో 5 టీ20మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ క్రమంలో జూన్ 5న సెలెక్ట్ అయిన ప్లేయర్లు అందరూ ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని బోర్డు ఆటగాళ్లకు సందేశాలు పంపించింది. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లయిన కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక కోవిడ్ 19 వల్ల గత ఇంగ్లాండ్ పర్యటనలో పెండింగ్‌లో ఉన్న ఐదో టెస్టు పట్ల కూడా బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఇక దక్షిణాఫ్రికా టీంతో ఆడబోయే జట్టుకు కేఎల్ రాహుల్ (కెప్టెన్) కాగా రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)గా ఎంపికయ్యారు. టెంబా బావుమా కెప్టెన్సీ దక్షిణాఫ్రికా టీం జూన్ 2న ఢిల్లీకి చేరుకుంటుందని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) పేర్కొంది.
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రకారం.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లకు బోర్డు సోమవారం సందేశాలు పంపింది. ఢిల్లీలో తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. మిగిలిన నాలుగు టీ20ల విషయానికొస్తే అవి వరుసగా జూన్ 12, 14, 17, 19వ తేదీల్లో కటక్, వైజాగ్, రాజ్‌కోట్, బెంగళూరులో జరుగుతాయి. భారత టెస్ట్ జట్టు జూన్ 16న ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. అంతరం రెండు T20ల సిరీస్ కోసం భారత జట్టు జూన్ చివరి వారంలో ఐర్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. దీని కోసం ఇంకా జట్టును ఎంపిక చేయలేదు. ఎంపికైన తర్వాత ఆటగాళ్లు జూన్ 23 లేదా 24న ఐర్లాండ్‌కు వెళతారు.
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రాబోయే దక్షిణాఫ్రికా T20లలో ఆడడంతో పాటు టెస్ట్ జట్టుకు ఎంపికవ్వడంతో వారు జూన్ 19న ఇంగ్లాండ్‌కు బయలుదేరుతారు. వారు చివరి టీ20 మ్యాచ్ వేదిక అయిన బెంగళూరు నుండి నేరుగా యూకేకి బయలుదేరుతారు. అయితే ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ సౌతాఫ్రికా సిరీస్ కోసం పూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తారా లేదా.. ఇంగ్లాండ్ తో టెస్టు కోసం యూకేకి వెళతారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇకపోతే వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ టూర్‌కు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండబోతున్నాడు.