
భాగాలుగా షెడ్యూల్ విడుదల
'ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఇప్పటికే ఆలస్యమైంది. అయితే ఇప్పుడు రూపకల్పన పూర్తయింది. శుక్రవారం విడుదల చేస్తాం' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ టీవీ చానెల్‌తో చెప్పాడు. అయితే ఇక్కడే అసలు ట్వీస్ట్ ఉంది. ఐపీఎల్ షెడ్యూలును పూర్తిగా విడుదల చేయరని సమాచారం తెలుస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా షెడ్యూల్‌ను భాగాలు విడుదల చేయాలని బీసీసీఐ అంతర్గత సమావేశాలలో నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా ఈరోజు తేలిపోనుంది.

బీసీసీఐ సభ్యుడికి కరోనా
ఐపీఎల్ నిర్వహణను పర్యవేక్షించడం కోసం యూఏఈలో ఉన్న బీసీసీఐ బృందంలోని ఓ సభ్యుడికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యక్తి జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో సభ్యుడని, సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్ల కోసం అతడు ఇక్కడికి వచ్చాడని మరో బీసీసీఐ అధికారి తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు సహా చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన 13 మంది కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యానికి ఇది కూడా ఓ కారణం.

53 రోజుల విండోలో 60 మ్యాచ్‌లు:
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. బయో సెక్యూర్ వాతావరణంలో ఈ నెల 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరుగనుంది. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి.

ఆరంభ మ్యాచ్ ఆడేది ఎవరు:
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఆరంభ మ్యాచ్ ఆడాలి. కరోనా కేసులు రావడంతో క్వారంటైన్‌లో ఉండటంతో చెన్నై టీమ్ ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై ఆటగాళ్లు సాధన చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై స్థానంలో మరో టీమ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. షెడ్యూల్‌లో తొలి మ్యాచ్ నుంచి చెన్నై టీమ్‌ను తప్పించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఛాన్స్ ఇస్తారని సమాచారం. మరోవైపు చెన్నై జట్టే ఆడుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications

'ఆ ఆరు రోజుల క్వారంటైన్.. నా జీవితంలోనే పరమ చెత్తది'










