అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా: సెలక్షన్ కమిటీపై ఇంజనీర్ తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: ఎమ్మెస్కే ప్రసాద్ ఛీఫ్ సెలక్టర్‌గా ఉన్న బీసీసీఐ సెలక్షన్ కమిటీపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనకున్న క్రికెట్ సెలక్షన్ కమిటీ మికీ మౌస్ సెలక్షన్ కమిటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీ కప్‌లు అందివ్వాలంటే ఈ తరహా సెలక్షన్ కమిటీనే సరైనదంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.

వరల్డ్‌కప్‌లో అనుష్క శర్మకు టీ కప్‌లు ఇచ్చారు
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సెలక్టర్లు టీ కప్‌లు ఇచ్చిన విషయాన్ని అందరితో పాటు తాను చూశానంటూ ఫరూక్ మండిపడ్డాడు. ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ "మనకున్న క్రికెట్ సెలక్షన్ కమిటీ మికీ మౌస్ సెలక్షన్ కమిటీ. ఈ ప్రక్రియలో కోహ్లీ ఎక్కువ ప్రభావాన్ని చూపుతాడు" అని అన్నాడు.

సెలెక్టర్లు ఎలా అర్హులు?
"కానీ సెలెక్టర్లు ఎలా అర్హులు? మన సెలక్షన్ కమిటీ ఎంపికకు దేనిని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్‌కే ప‍్రసాద్‌ను ఉద్దేశిస్తూ)" అని మండిపడ్డాడు.

సెలక్షన్ కమిటీపై నిప్పులు చెరిగిన ఫరూక్ ఇంజనీర్
"ఈ సెలక్టర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండొచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు. మన సెలక్షన్ కమిటీలో వెంగసర్కార్ లాంటి వ్యక్తి ఉండాలి" అని పుణెలోని వెంగసర్కార్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూక్ సెలక్షన్ కమిటీపై నిప్పులు చెరిగారు.

సీఓఏపై కూడా విమర్శలు
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కొత్త బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించడాన్ని స్వాగతించిన ఫరూక్ ఇంజనీర్... సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ(సీఓఏ)పై కూడా విమర్శలు చేశాడు. భారత క్రికెట్ బోర్డును ఎలా నడిపించాలనే దానిపై సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ(సీఓఏ) సభ్యులకు ఎటువంటి క్లూ లేదని అన్నారు. కాగా, ఫరూక్ ఇంజనీర్ 46 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications