Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫిక్సింగ్ - నోరు విప్పిన బీసీసీఐ!

Rajasthan Royals Match fixing: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపార వేత్త.. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నాడని బీసీసీఐ హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే, సొంత జట్టుపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై తాజాగా బీసీసీఐ స్పందించింది.

అసలు ఏం జరిగిందంటే
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడగా.. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. పైగా చేతివరకు వచ్చిన విజయాలను కూడా చేజార్చుకుంటోంది. రీసెంట్ గా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్లపై తక్కువ పరుగుల తేడాతో ఓడింది ఆర్ఆర్. ఆఖరి ఓవర్లో కనీస పరుగులు చేయలేక పరాజయం పొందింది. దీంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ కన్వీనియర్ జయదీప్ బిహానీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజస్థాన్ రాయల్స్‌ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. చిన్నపిల్లలు కూడా దీన్ని ఫిక్సింగ్ మ్యాచ్ అంటారని వ్యాఖ్యానించాడు. దీనిపై ఉన్నత స్థాయి విచరణ జరపాలంటూ డిమాండ్ చేశాడు. అయితే ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ తాజాగా స్పందించింది. ఐపీఎల్‌పై తమ నిఘా ఎప్పుడూ ఉంటుందని, రాజస్థాన్ క్రికెట్ చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదంటూ బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

BCCI clarifies on Rajasthan Royals match fixing controversy in IPL 2025

"రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో త్వరలోనే ఎన్నికల జరగబోతున్నాయి. దీని చుట్టూ ఎంతో డ్రామా జరుగుతోంది. ప్రతిఒక్కరికీ అటెన్షన్ కావాలి. ఇప్పటికే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం‌ 24 గంటల పాటూ ఐపీఎల్‌పై కన్సేసి ఉంచింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు." అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

కాగా, ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుంది. దీంతో రాజస్థాన్ మ్యాచ్‌లను వీక్షించే ప్రేక్షకులు తగ్గిపోయారు. సాధారణంగా రాజస్థాన్ మ్యాచ్‌లకు 1800 టికెట్ల కన్నా ఎక్కువగా అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు వెయ్యి నుంచి 1200 వరకే టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది.

Story first published: Wednesday, April 23, 2025, 11:45 [IST]
Other articles published on Apr 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+