
వ్యక్తిగత కారణాలతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వీ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆయన నోటీస్ పీరియడ్ నవంబర్ 30 నాటికే ముగిసింది. కానీ డిసెంబర్ 7 నుంచి భారత్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ ఉండడంతో ఆ మ్యాచ్ ముగిసే వరకు ఆయన కొనసాగారు. బీసీసీఐతో తన 10 సంవత్సల జర్నీ అద్భుతంగా సాగిందని చెప్పిన ఆయన.. ఇన్నేళ్ల కాలం తర్వాత తాను ఏదైన విభిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అందుకే బీసీసీఐకి రాజీనామా చేసినట్టు చెప్పారు. కరోనా టైమ్‌లో పనిచేయడం సవాలుగా మారిందని ఆయన చెప్పారు. తన జాబ్‌లో చివరి రోజుల్లో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనానని చెప్పారు. కరోనా నుంచి కోలుకుని ప్రస్తుతం అన్ని టోర్నమెంట్లు విజయవంతంగా సాగుతుండడం పట్ల తనకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీ క్రికెట్‌తోపాటు దేశవాళీ టోర్నమెంట్‌లు కూడా బాగా నడుస్తున్నాయని అన్నారు.
కరోనా టైమ్‌లో కీలకపాత్ర
కాగా కరోనా టైమ్‌లో అభిజిత్ సాల్వీ భారత జట్టులో కీలకపాత్ర పోషించారు. బయోబబుల్‌లోని టీమిండియా బృందానికి సాల్వీనే పరీక్షలు జరిపేవారు. బీసీసీఐ వయస్సు నిర్ధారణ, యాంటీ డోపింగ్, మెడికల్ విభాగానికి కూడా సాల్వినే బాధ్యత వహించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక సహా కొన్ని పర్యటనల్లో సాల్వీ భారత జట్టుతోనే ఉన్నారు. యూఏఈలో జరగిన ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ వైద్య ఏర్పాట్లను కూడా సాల్వీనే పర్యవేక్షించారు. అయితే ఇన్ని రోజులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న అభిజిత్ సాల్వీ రాజీనామా చేయడంతో బీసీసీఐ ప్రస్తుతం కొత్త సీఎంవోను వెతికే పనిలో పడింది.
జాలీగా గడిపిన టీమిండియా
మరోవైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు జాలీగా గడిపింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో సహా ఆటగాళ్లంతా ఫుట్ బాల్ ఆడారు. రెండు జట్లుగా విడిపోయి ఆడిన ఈ టీంలకు ద్రావిడ్, అశ్విన్ నాయకత్వం వహించారు. ఈ విషయాన్ని చెబుతూ బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. కాగా ఆదివారం నుంచి టీమిండియా ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టనుంది. ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే సందర్భంగా భారత్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ మైదానం ఈ టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. అనంతర మరో టెస్టు మ్యాచ్‌లతోపాటు మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉంది. కానీ దీనిపై ఇరు జట్ల బోర్డులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.