వన్డే సమయాల్లో మార్పు: తొలి రెండు వన్డేలు ఉదయం 11.30కే

హైదరాబాద్: భారత్-శ్రీలంకల మధ్య డిసెంబర్10 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ షెడ్యూల్‌లో చిన్నపాటి మార్పు చోటు చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాల, మొహాలీ వేదికల్లో డిసెంబర్ 10, 13న జరిగే తొలి రెండు వన్డేల సమయాలను బీసీసీఐ మార్చింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రాత్రి వేళ మంచు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్‌లను ఉదయం 11:30 గంటలకే మొదలుపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేసింది.
'హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌పీసీఏ), పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు సవరించిన సమయం ప్రకారం డిసెంబర్ 10న ధర్మశాలలో తొలి వన్డే, డిసెంబర్ 13న మొహాలీలో రెండో వన్డే జరుగుతాయి' అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక విశాఖ వేదికగా జరిగే మూడో వన్డే.. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరగనుంది. మూడో వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications