కోహ్లీ, రోహిత్ విబేధాలు.. రంగంలోకి బీసీసీఐ సీఈవో!!

ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇందులో భాగంగా స్వయంగా బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి రంగంలోకి దిగుతున్నాడట. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఈ రోజు అమెరికాకు భారత జట్టు వెళ్లనుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఏమైనా విభేదాలు ఉంటే:
విండీస్‌తో జరిగే తొలి రెండు టీ20లను భారత్ యూఎస్‌లో ఆడనుంది. చివరి టీ20 సహా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయి. వారంలోగా బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి యూఎస్‌కు వెళ్లనున్నాడు. అక్కడ కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడి.. వారి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే పరిష్కరిస్తాడట. అంతేకాదు భవిషత్ పర్యటనల గురించి విండీస్ బోర్డు అధికారులతో మాట్లాడుతాడట.

సరైన కారణం లేదు:
'రోహిత్, కోహ్లీ విభేదాల విషయంలో బోర్డు సహాయక సిబ్బంది జోక్యం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇద్దరు ఎంతో పరిణతి ఉన్న వ్యక్తులు. వారితో మాట్లాడితే పరిస్థితి మాములుగా మారుతుంది' అని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. 'రాహుల్ జోహ్రి యుఎస్ వెళుతున్నాడు. అయితే ఈ ప్రయాణానికి సరైన కారణం కనిపించడం లేదు. ఒంటరిగా కాకుండా ఇతర సిబ్బంది కూడా వెళుతున్నారని తెలిసింది. అక్కడికి ఎందుకు వెళుతున్నారో తెలియడం లేదు' అని మరో బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. మరోవైపు జోహ్రీ అమెరికా ప్రయాణంపై పలువురు బీసీసీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

రవిశాస్త్రినే మాట్లాడుతాడా:
మరోవైపు రోహిత్, కోహ్లీ విభేదాల విషయంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రినే మాట్లాడుతాడని సమాచారం. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు. ఆ సమయంలో రవిశాస్త్రి జట్టుతోనే ఉన్నాడు. ఆ సమయంలో జట్టులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా రవిశాస్త్రి చూసాడు. ఇప్పుడు కూడా అతనే సమస్యను సద్దుమణిగిస్తాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

మీడియా ముందుకు కోహ్లీ:
వెస్టిండీస్ పర్యటన ముందు సోమవారం ముంబైలోని హోటల్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచకప్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాల కారణంగా మీడియా సమావేశానికి కోహ్లీ దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంకు కోహ్లీ హాజరవుతాడని బీసీసీఐ ప్రకటించింది. ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో కోహ్లీ విభేదాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications