
రాహుల్, పంత్‌కు ప్రమోషన్..
టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో వీరికి అవకాశం దక్కనుంది. ప్రస్తుత కాంట్రాక్టులో ఈ ఇద్దరు గ్రేడ్-ఏ కాంట్రాక్ట్‌లో ఉన్నారు. కొంతకాలంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు. తమకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ప్రమోషన్ లభించనుంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఈ కాంట్రాక్ట్ దక్కుతుంది.

సిరాజ్, షమీకి సైతం..
ఇక గతేడాదిగా బౌలర్‌గా మంచి ప్రదర్శన ఇస్తున్న మహ్మద్ సిరాజ్‌ను గ్రేడ్ సి నుంచి గ్రేడ్ బికి ప్రమోట్ చేసే అవకాశం ఉంది. టెస్టుల్లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్‌తో పాటు హనుమ విహారిలకు కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇక ఉమేశ్ యాదవ్, ఇషాంత్శర్మలకు డిమోషన్ తప్పేలా లేదు. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్షర్ పటేల్, మహమ్మద్ షమీలకు కూడా ప్రమోషన్ లభించనుంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ సిద్దం చేశామని, త్వరలోనే ఫైనలైజ్ చేస్తామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఏయే కేటగికి ఎంత జీతం అంటే..?
ఏ ప్లస్ కేటగిరి కింద ఒక్కో ఆటగానికి వార్షిక కాంట్రాక్ట్‌పై రూ.7 కోట్లు చెల్లిస్తారు
ఏ కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తారు.
బి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.3 కోట్లు చెల్లిస్తారు
సి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి చెల్లిస్తారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా(అక్టోబర్ 2021 టూ సెప్టెంబర్ 2022):
గ్రేడ్ ఏ ప్లస్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
గ్రేడ్ ఏ: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా
గ్రేడ్ బి: వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్
గ్రేడ్ సి: కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుబ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్