
ధోని రిటైర్మెంట్ గురించి
ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ధోని రిటైర్మెంట్‌పై మరోసారి స్పష్టత నిచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ "ధోని భవితవ్యంపై నేను ఇక్కడ చెప్పలేను" అని అన్నాడు.

బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత
"నేను బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత ధోని చర్చించా. ధోని భవిష్య ప్రణాళికపై అతనికే వదిలిపెడదాం. ధోనీని ఎవరైనా గౌరవిస్తారు. భారత క్రికెట్‌కు ధోని చాలా చేశాడు. కేవలం థాంక్స్‌తో అతని సేవలకు ముగింపు చెప్పలేం. రిటైర్మెంట్‌పై ధోనినే నిర్ణయం తీసుకుంటాడు. ధోని రిటైర్మెంట్‌పై చర్చలకు ముగింపు పలుకుదాం. దిగ్గజాలకు తగిన గౌరవం ఇవ్వాలి" అని గంగూలీ అన్నాడు.

కోహ్లీతో కూడా మాట్లాడుతున్నాం
"అవును(బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ధోనితో మాట్లాడుతున్నాను). అతడికి టచ్‌లోనే ఉన్నాం. మేము విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడుతున్నాం. మేము సెలెక్టర్లతో మాట్లాడతాము. అది టీమిండియా క్రికెట్ అధికారులు, సెలక్షన్ కమిటీ చూసుకుంటుంది. ధోని రిటైర్మెంట్ అంశం ప్రస్తుతానికి అక్కడే ఉంది" అని గంగూలీ తెలిపాడు.

వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.


Click it and Unblock the Notifications












