Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్ని ఖర్చులు మావే: తొలిసారి రంజీ క్రికెట్ ఆడనున్న ఈశాన్య రాష్ట్రాలు

BCCI to bear all expenses of North-East States’ Ranji Trophy debut

హైదరాబాద్: తొలిసారి రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్న ఈశాన్య రాష్ట్రాల జట్లకు సంబంధించిన ఖర్చులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భరించనుంది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా చేసిన సిఫారసులకు అనుగుణంగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు ఆయా జట్లకు అవసరమయ్యే కోచ్‌లు, ఫిజియోలు, ట్రెయినర్లను కూడా బీసీసీఐనే సమకూర్చనుంది. అన్ని వయసు విభాగాలకు చెందిన జట్లకు ఇది వర్తించనుంది. మాములుగా అయితే సహాయక సిబ్బందికి ఆయా రాష్ట్రాలు జీతాలు చెల్లిస్తోన్న సంగతి తెలిసిందే.

 లోథా కమిటీ నిబంధనల ప్రకారం

లోథా కమిటీ నిబంధనల ప్రకారం

అయితే, లోథా కమిటీ నిబంధనల ప్రకారం ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం బోర్డు చెల్లిస్తుండటం విశేషం. ఒక్కో రాష్ట్రానికి సుమారు నాలుగైదు కోట్లు ఖర్చు చేసేందుకు బోర్డు సిద్ధమవుతోంది. దీంతో ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు బుధవారం బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ సాబా కరీమ్ భేటి అయ్యారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల అవసరాలను, కేటాయింపులను కూలంకషంగా చర్చించారు.

మ్యాచ్‌ల కోసం రైళ్లలో ప్రయాణం

మ్యాచ్‌ల కోసం రైళ్లలో ప్రయాణం

సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశ్‌లో మైదానాలు లేకపోవడంతో పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రాల్లో మ్యాచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో సిక్కీం.. సిలిగురిలో, ఆరుణాచల్ ప్రదేశ్‌లో.. అస్సామ్‌లోని స్టేడియాల్లో మ్యాచ్‌లను ఆడనున్నాయి. ఇందులో భాగంగా సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్‌లకు చెందిన ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌ల కోసం రైళ్లలో ప్రయాణం చేయాల్సి ఉంది. వీళ్లు వెళ్లాల్సిన ప్రాంతాలకు విమాన సౌకర్యం లేదు.

షెడ్యూల్ అనుగుణంగా టిక్కెట్లు

షెడ్యూల్ అనుగుణంగా టిక్కెట్లు

దీంతో షెడ్యూల్ అనుగుణంగా టిక్కెట్లను బోర్డు బుక్ చేయనుంది. మ్యాచ్‌లు, ఆటగాళ్ల ఎంపిక మొత్తం బీసీసీఐ నిబంధనలకు లోబడే జరుగుతుండటం విశేషం. బర్త్ సర్టిఫికెట్‌తో నేరుగా ఎవరైనా శిబిరానికి హాజరుకావొచ్చు. బ్యాంక్ అకౌంట్, రెండేళ్లుగా ఉద్యోగం చేసిన వివరాలు సమర్పిస్తే చాలని బోర్డు వెల్లడించింది. జట్టులో ముగ్గురు ప్రొఫెషనల్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.

ఖర్చులు మాత్రమే ఇస్తున్నామన్న బోర్డు

ఖర్చులు మాత్రమే ఇస్తున్నామన్న బోర్డు

ప్రస్తుతానికి వీళ్లకు ఖర్చులు మాత్రమే ఇస్తున్నట్లు సాబా కరీమ్ తెలిపాడు. లోథా కమిటీ నిబంధనల్లో భాగంగా ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ ప్రమోట్ చేయాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలను బీసీసీఐ ఆరో జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నార్త్, సెంట్రల్, వెస్ట్, సౌత్, ఈస్ట్ జోన్ల తరుపున బీసీసీఐ రంజీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయకు చెందిన క్రికెటర్లకు గౌహతిలో ప్రీ సీజన్ క్యాంపుని నిర్వహించారు. మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన క్రికెటర్లకు తమిళనాడు, కర్ణాటకలో ప్రీ-సీజన్ క్యాంపులను బీసీసీఐ నిర్వహించింది.

Story first published: Thursday, August 2, 2018, 16:55 [IST]
Other articles published on Aug 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+