ఏజ్ ఫ్రాడ్: ఢిల్లీ ప్లేయర్ ప్రిన్స్ రామ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ

హైదరాబాద్: అండర్-19 టోర్నమెంట్‌లో ఆడేందుకు తన వయసుని దాచిపెట్టిన ఢిల్లీ క్రికెటర్ ప్రిన్స్ రామ్ నివాస్ యాదవ్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. రామ్ నివాస్ యాదవ్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగుచూడటంతో అతడిని రెండేళ్ల పాటు దేశవాళీ సీజన్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఫలితంగా ఢిల్లీ & డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌లో తన పేరుని నమోదు చేసుకున్న రామ్ నివాస్ యాదవ్ 2020-21, 2021-22 సీజన్లలో దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మేరకు డీడీసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ "అతను వయసుతో బోర్డును, రాష్ట్ర అసోసియేషన్‌ను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. బీసీసీఐ నుంచి మాకు సమాచారం అందింది" అని అన్నారు.

బీసీసీఐ కీలక నిర్ణయం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జారీ చేసిన సర్టిఫికేట్ ఆధారంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అతను 1996, జూన్ 10వ తేదీన పుడితే, బీసీసీఐకి ఇచ్చిన సర్టిఫికేట్‌లో 2001, డిసెంబర్ 12వ తేదీన పుట్టినట్లుగా చూపబడింది. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

డీడీసీఏకు బీసీసీఐ రాసిన ఈమెయిల్‌లో
డీడీసీఏకు బీసీసీఐ రాసిన ఈమెయిల్‌లో "రామ్ నివాస్ యాదవ్ (ప్లేయర్ ఐడి 12968). ఢిల్లీ తరఫున అండర్-19 ఏజ్ గ్రూప్ విభాగంలో 2018-19 సీజన్‌కు సంబంధించి అండర్-19 క్రికెట్ కేటగిరీలో అతను రిజస్టర్ చేసుకున్నాడు. తాజాగా 2019-20లో కూడా తిరిగి నమోదు చేసుకున్నాడు. ఇటీవల సమర్పించిన జనన ధృవీకరణ పత్రం ప్రకారం అతని పుట్టిన తేదీ డిసెంబర్ 12, 2001"గా ఉంది.

పుట్టిన తేదీ 10 జూన్ 1996
"అయితే, క్రికెటర్ వయస్సు పైబడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సమర్పించిన సర్టిఫికేట్‌ను బీసీసీఐ తనిఖీ చేసింది. అందులో రామ్ నివాస్ యాదవ్ 2012లో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు ఉంది. అంతేకాదు అతని అసలు పుట్టిన తేదీ 10 జూన్ 1996"గా పేర్కొనబడింది.

రెండు సీజన్లకు దూరం
"పై విషయాలను దృష్టిలో ఉంచుకుని యాదవ్‌ను రెండు సీజన్లు(2020-21 మరియు 2021-22) దేశీయ క్రికెట్ సీజన్లలో పాల్గొనడానికి బీసీసీఐ నిషేధం విధించింది. తన రండేళ్ల పూర్తైన తరువాత, అతను సీనియర్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొనడానికి అనుమతించబడతాడు" అని డీడీసీఏకు రాసిన మెయిల్‌లో బీసీసీఐ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications