For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రంగంలోకి బీసీసీఐ: పాత్రికేయుడిని తిట్టిన కోహ్లీని వెనకేసుకొచ్చింది

By Srinivas

ముంబై: జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించిన విరాట్ కోహ్లీని బీసీసీఐ వెనుకేసుకు వచ్చింది. తన ప్రియురాలు అనుష్క శర్మ, తనకు సంబంధించిన కథనాలు రాశారని ఓ పాత్రికేయుడిని కోహ్లీ తిట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ రంగంలోకి దిగింది. సదరు జర్నలిస్ట్ పట్ల కోహ్లీ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది.

బీసీసీఐ మీడియా మేనేజర్ ఆర్ ఎన్ బాబా మీడియాకు ఈ మెయిల్ చేశారు. కోహ్లీ అనుచితంగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. 'నిన్నటి సంఘటన పైన వివరణ' అని పంపిన ఈ మెయిల్‌లో... కోహ్లీ సదరు పాత్రికేయుడిని తిట్టారని మీడియా అపార్థం చేసుకుందని, కోహ్లీ అనుచితంగా ప్రవర్తించలేదని, ఆ తర్వాత కోహ్లీ ఆ జర్నలిస్ట్‌తో కూడా మాట్లాడాడని చెప్పారు.

BCCI backs Kohli, says 'no abusive language was used' on journalist

కాగా, పెర్త్‌లోని వాకా మైదానంలో మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ ముగించుకున్న కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్నపుడు అతనికి మార్గమధ్యలో ఓ జాతీయ దినపత్రిక విలేకరి కనబడ్డాడు. అంతే ఆగ్రహంతో కోహ్లీ ఆయనపై బూతు పురాణం అందుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

విరాట్‌ తిట్లకు పక్కనే ఉన్న సహచరులు కూడా ఆశ్చర్యపోయారు. తనను ఎందుకు తిడుతున్నాడో కూడా తెలియని ఆ రిపోర్టర్‌ కూడా గందరగోళానికి గురయ్యాడు. అనంతరం సహచరులు సముదాయించడంతో కోహ్లీ అసలు విషయం చెప్పాడు. గతంలో తన గురించి, ప్రియురాలు అనుష్క గురించి అవాస్తవ కథనం రాసింది ఆ రిపోర్టరేనని తోటి ఆటగాళ్లకు చెప్పాడు.

అయితే ఆ వార్త రాసింది సదరు రిపోర్టర్‌ కాదని తెలియడంతో కోహ్లీ అతనికి క్షమాపణలు చెప్పాడు. దీనిపై రవిశాస్త్రి.. కోహ్లీని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మీడియాతో జాగ్రత్త వహించాలని హితవు పలికారు. కాగా, ఈ సంఘటన పైన సదరు పాత్రికేయుడు వివరాలతో రాశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+