న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో కోహ్లీ, అనుష్కలతో పాటు క్రికెట్ ప్రముఖులు

BCCI Awards: Indian skipper Virat Kohli receives Polly Umrigar award for international cricketer of the year

హైదరాబాద్: బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో విరాట్ కోహ్లీ సతీసమేతంగా విచ్చేసి సందడి చేశారు. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మిథాలీ రాజ్, స్మృతీ మందాన, క్రికెట్ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. గురువారం నుంచి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఏకైక టెస్టు ఆడబోతుండగా.. రెండు రోజుల ముందు పలువురు భారత క్రికెటర్లు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

2016-17, 2017-18 సీజన్లకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పాలి ఉమ్రిగర్‌ పురస్కారానికి ఎంపికైన కోహ్లి.. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విరాట్‌.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. సతీసమేతంగా సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో కనిపించిన కోహ్లీ, అను అవార్డుల వేడుకకు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మొత్తం హాజరు కావడం విశేషం.

BCCI Awards: Indian skipper Virat Kohli receives Polly Umrigar award for international cricketer of the year

పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌.. పటౌడీ స్మారక ఉపన్యాసాన్నిచ్చాడు. అన్షుమన్‌ గైక్వాడ్‌, సుధా షా సీకే నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. పర్వేజ్‌ రసూల్‌, జలజ్‌ సక్సేనా, కృనాల్‌ పాండ్యా ఉత్తమ దేశవాళీ ప్రదర్శనకు గాను అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే. మహిళల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మందాన గత రెండు సీజన్లకు ఉత్తమ క్రికెటర్ల పురస్కారాల్ని అందుకున్నారు.

కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఛైర్మన్ వినోద్ రాయ్ మాట్లాడుతూ.. బీసీసీఐ వార్షికోత్సవ అవార్డులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రెండేళ్లలో పురుషుల, మహిళల క్రికెట్ జట్టుల నుంచి మంచి ప్రతిభ కనిపించింది. ఇలాంటి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది' అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, June 13, 2018, 16:28 [IST]
Other articles published on Jun 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X