న్యూఢిల్లీ: టీమిండియాకు ప్రస్తుతం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి శాస్త్రి వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు. 2015 ప్రపంచ కప్‌లో రవిశాస్త్తి సేవలను ఉపయోగించుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఈ మేరకు కొత్తగా నియమితులైన సిబ్బంది ఒప్పందాన్ని బీసీసీఐ పొడిగించింది. ఇక బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం నవంబర్ 20న జరగనుంది. 2015లో జరగనున్న ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి.

ఇటీవల ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటించినప్పుడు.. టెస్టు సిరిస్‌లో భారత్ విఫలం కావడంతో టీమిండియా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు రవిశాస్త్రి. బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన వన్డే సిరిస్‌లో యువకుల్లో ఆత్మస్దైర్యం నింపి మెరుగైన పనితీరు కనబర్చినట్లు బీసీసీఐ వర్దాలు భావించాయి.
దీంతో ఆయన కాంట్రాక్టును పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెన్నైలో జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. టెస్టు సిరీస్ ఓటమి అనంతరం రవిశాస్త్రిని టీమిడియా డైరెక్టర్‌గా.... సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లను భారత జట్టు సహాయ కోచ్‌లుగా తీసుకున్నారు. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.