Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనాకు వెళ్లే భారత జట్టు ఇదే.. కుర్రాడికి కెప్టెన్సీ ఇచ్చిన బీసీసీఐ!

క్రికెటింగ్ క్యాలెండర్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే బీసీసీఐ.. ఇంతకుముందు జరిగిన ఆసియా గేమ్స్‌కు తమ జట్టును పంపలేదు. అయితే ఈ ఏడాది చైనా వేదికగా జరిగే ఆసియా గేమ్స్ క్రీడలకు టీమిండియాను పంపాలని అనుకుంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా చైనా పంపే జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అందరూ అనుకున్నట్లు ఈ టీంకు కెప్టెన్‌గా శిఖర్ ధవన్‌ను సెలెక్ట్ చేయలేదు.

ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ జట్టు బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. మొత్తం 15 మందితో ప్రకటించిన ఈ జట్టులో రింకూ సింగ్, జితేశ్ శర్మ, శివమ్ దూబే వంటి టీ20 స్పెషలిస్టులకు కూడా చోటు దక్కింది. ఇలా వీళ్లందరికీ చోటో దక్కడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరికి అదనంగా మరో ఐదుగురు స్టాండ్ బై ప్లేయర్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు.

Ruturaj Gaikwad

ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టి తాజాగా విండీస్‌తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్‌కు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. అలాగే విండీస్ టూర్‌లో చోటు దక్కలేని బాధ పడిన జితేశ్ శర్మ, రింకూ సింగ్ వంటి వారిని ఈ టోర్నీకి సెలెక్ట్ చేశారు. అంతేకాదు పంజాబ్ కింగ్స్ తరఫున రాణించిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు కూడా అవకాశం దక్కడం గమనార్హం. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా ఈ టీంలో చోటు దక్కింది.

టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణయి, ఆవేష్ ఖాన్,, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

స్టాండ్ బై ప్లేయర్లు: వెంకటేశ్ అయ్యర్, యష్ ఠాకూర్, సాయి కిషోర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్

Story first published: Saturday, July 15, 2023, 8:33 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+