INDvsAUS : అతనికి మళ్లీ చోటు.. స్టార్ పేసర్ మాత్రం లేడు.. చివరి రెండు టెస్టులకు జట్టు ఇదే!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడిన తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడింది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలోనే చివరి రెండు టెస్టులకు కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. దీంతోపాటు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కేఎల్ రాహుల్‌కు ఈ జట్టులో స్థానం ఇవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

రాహుల్ కంటిన్యూ..
తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టునే చివరి రెండు టెస్టులకు కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించకపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. అతన్ని వైస్ కెప్టెన్‌గా తొలగించారా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాగే శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జయదేవ్ ఉనద్కత్‌ను కూడా ఈ జట్టులో కొనసాగుతున్నారు. అయితే గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఈ టెస్టులకు కూడా ఎంపిక చేయలేదు.
అదే జట్టు కదా..
తొలి రెండు టెస్టులు ఆడిన జట్టునే బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. అదే జట్టును కొనసాగించడానికి మళ్లీ జాబితా ప్రకటించడం దేనికి? సేమ్ జట్టు అని చెప్తే సరిపోయేది కదా అని అంటున్నారు.
చివరి టెస్టులకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్

వన్డేలకు కూడా బుమ్రా దూరం?
టెస్టు సిరీసు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. చివరగా భారత్ ఆడిన వన్డే సిరీసులో కేఎస్ భరత్‌కు కూడా భారత బృందంలో చోటు దక్కింది. కానీ కేఎల్ రాహుల్ తిరిగి రావడంతో ఆసీస్ వన్డే సిరీస్‌కు భరత్‌ను ఎంపిక చేయలేదు. జడేజా, అక్షర్ పటేల్ కూడా జట్టులో చోటు నిలుపుకున్నారు. జయదేవ్ ఉనద్కత్‌ను కూడా వన్డే సిరీస్‌కు ఎంపిక చేయడం గమనార్హం.
తొలి వన్డేకు రోహిత్ దూరం..
అయితే వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ తొలి వన్డే ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది. ఈ వన్డేలో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది. ఈ సిరీస్ నాటికి జట్టుతో చేరతాడని అనుకున్న జస్‌ప్రీత్ బుమ్రా ఈ బృందంలో లేకపోవడం గమనార్హం.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications