న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన..: షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

BCCI Announces Schedule For Womens Home Series Against England

హైదరాబాద్: భారత్‌లో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలుత రెండు జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత మూడు టీ20లు ఆడతాయి.

"భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళల జట్ల పర్యటన షెడ్యూలును బీసీసీఐ, ఈసీబీ ప్రకటించాయి. రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ2లు ఆడతాయి. వన్డేలు ఉదయం 9 గంటలకు, టీ20లు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి" అని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి వెల్లడించారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో

ముంబైలోని వాంఖడే స్టేడియంలో

మూడు వన్డేలు ముంబైలోని వాంఖడే స్టేడియంలో, టీ20లు గువహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మ్యాచ్‌లు మొదలవుతాయని బీసీసీఐ వెల్లడించింది. ఈ సిరిస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు బీపీ XIతో ఇంగ్లండ్ జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

న్యూజిలాండ్‌కు పయనమైన భారత మహిళల జట్టు

న్యూజిలాండ్‌కు పయనమైన భారత మహిళల జట్టు

ఈ మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 22, 25, 28న వన్డేలు, మార్చి 4, 7, 9న టీ20లు జరుగుతాయి. కాగా, ఈ సిరీస్ కంటే ముందు భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు న్యూజిలాండ్‌కు పయనమైంది. ఈ సిరీస్‌ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 10 వరకూ జరుగనుంది.

వన్డే షెడ్యూల్:

వన్డే షెడ్యూల్:

  • 1st ODI - February 22 in Mumbai
  • 2nd ODI - February 25 in Mumbai
  • 3rd ODI - February 28 in Mumbai
  • టీ20 షెడ్యూల్:

    టీ20 షెడ్యూల్:

    • 1st T20I - March 4 in Guwahati
    • 2nd T20I - March 7 in Guwahati
    • 3rd T20I - March 9 in Guwahati
Story first published: Friday, January 18, 2019, 9:01 [IST]
Other articles published on Jan 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X