హైదరాబాద్: టీమిండియాకి కొత్త కిట్ స్ఫాన్సర్ అధికారికంగా ఖరారు అయింది. టీమిండియా కిట్ కొత్త స్పాన్సర్, వాణిజ్య భాగస్వామిగా మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) స్పోర్ట్స్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. నైక్ కుదుర్చున్న ఐదేళ్ల ఒప్పందం ముగియడంతో ఎంపీఎల్ స్పోర్ట్స్‌తో బీసీసీఐ మూడేళ్ల (ఈ ఏడాది నవంబరు నుంచి డిసెంబరు 2023 వరకూ) ఒప్పందాన్ని చేసుకుంది. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.
మూడేళ్ల ఒప్పందంలో భాగంగా భారత సీనియర్ పురుషుల, మహిళల జట్లతో పాటు అండర్-19 జట్లు ఎంపీఎల్ జెర్సీలను ధరిస్తాయి. స్పాన్సర్స్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'టీమిండియా కిట్‌లో ఎంపీఎల్ స్పోర్ట్స్ కొత్త అధ్యయాన్ని సృష్టించాలని ఎదురుచూస్తున్నాం. లక్షల మంది అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన వస్తువులను సులువుగా అందజేయడానికి ప్రయత్నిస్తాం' అని అన్నాడు.
మొబైల్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన క్రీడా వస్తువుల విక్రయ సంస్థ ఎంపీఎల్ స్పోర్ట్స్. ఇది ఈ-స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్. దీనిలో క్రీడలకు సంబంధిచిన వస్తువులు విక్రయిస్తారు. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా, బెంగళూరు జట్ల ప్రాంఛైజీలతో ఎంపీఎల్ స్పోర్ట్స్ అనుబంధం కలిగి ఉంది. ఇక ఐర్లాండ్, యూఏఈ జట్లకు.. సీపీఎల్‌లోని ఒక జట్టుతో భాగస్వామిగా ఎంపీఎల్ వ్యవహరిస్తుంది. ఎంపీఎల్‌కు స్టార్ క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.
ఈ ఏడాది నవంబరు నుంచి భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కీ కిట్ స్ఫాన్సర్ రూపంలో రూ. 65 లక్షలు ఎంపీఎల్ ఇవ్వనుంది. మొత్తంగా ఈ మూడేళ్ల కలిపి రూ. 120 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. నైక్ సంస్థ ఒక మ్యాచ్‌కు 88 లక్షలు ఇచ్చేది. నైక్ తన అయిదేళ్ల ఒప్పందంలో 2016 నుంచి 2020 వరకు 370 కోట్లు చెల్లించింది. నిజానికి నైక్‌కి మళ్లీ కిట్ స్ఫాన్సర్‌షిప్ దక్కుతుందని అంతా ఊహించారు. అయితే కరోనా వేళ గత స్ఫాన్సర్‌షిప్‌ని పరిగణలోకి తీసుకుని డిస్కౌంట్ ఇవ్వాలని నైక్ అడగ్గా.. బీసీసీఐ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దాంతో ఎంపీఎల్ ఆ కిట్ స్ఫాన్సర్‌షిప్ ఛాన్స్‌ని దక్కించుకుంది.
కోహ్లీనే కెలుకుతావా.. ఇక నీపని అయిపొయింది పో!! జీవితంలో టీమిండియాకు ఆడవ్!!