Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్‌కు భారత జట్టు ఎంపిక

BCCI announces India women squad for England ODIs

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరిస్‌కు సెలక్టర్లు భారత మహిళల జట్టుని ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. భారత మహిళల జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ఈ సిరిస్‌లోని అన్ని మ్యాచ్‌లు నాగ్‌పూర్‌లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 6, 9, 12 తేదీల్లో జరగనున్నాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ మహిళల జట్టు వన్డే సిరిస్ ప్రారంభానికి ముందు నాగ్‌పూర్‌లో ఇండియా-ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడనుంది.

ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం దీప్తి శర్మ నాయకత్వంలో 14 మందితో కూడిన భారత-ఏ జట్టును కూడా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రస్తుతం సొంతగడ్డపై ముంబైలో జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలై టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో ఓటమిని ఎదుర్కొంది.

భారత మహిళల వన్డే జట్టు:
మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హేమలత, వేద కృష్ణ మూర్తి, దేవికా వైద్య, జులన్ గోస్వామి, శికా పాండే, పూజా వస్ర్తాకర్, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), రాజేశ్వరీ గైక్వాడ్

ప్రాక్టీస్ మ్యాచ్‌కి భారత-ఏ జట్టు:

షెడ్యూల్:
ప్రాక్టీస్ మ్యాచ్: India A vs England on April 3, 2018
1st ODI: India vs England on April 6, 2018
2nd ODI: India vs England on April 9, 2018
3rd ODI: India vs England on April 12, 2018

Story first published: Tuesday, March 27, 2018, 11:12 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+