ముంబై: ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ముగించిన భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు భారత సెలెక్షన్ కమిటీ మంగళవారం జంబో జట్టును ప్రకటించింది. పెటర్నిటీ లీవ్‌తో జట్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మలకు కూడా అవకాశం దక్కింది. ఐపీఎల్లో గాయపడ్డ ఇషాంత్ శర్మ.. ఆ కారణంగానే ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లకు చోటు దక్కగా.. నటరాజన్, నవ్‌దీప్ సైనీలకు మాత్రం నిరాశే ఎదురైంది. పేలవ ఆటతీరుతో దారుణంగా విఫలమైన పృథ్వీషాపై వేటు పడింది. గాయాలతో తప్పుకున్న మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, హనుమ విహారీలకు కూడా చోటు దక్కలేదు. అక్షర్ పటేల్‌కు అరంగేట్ర పిలుపు రాగా.. తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు స్టాండ్‌బై ఆటగాళ్లలో అవకాశం దక్కింది.
ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు రెండో టెస్టు చెన్నై వేదికగా జరగనున్నాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈ నెల 27 చెన్నై వస్తుంది. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టుతో లేని ఆటగాళ్ళు జనవరి 23నే భారత్‌కు రానున్నారు.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్
స్టాండ్‌బై ప్లేయర్స్: కేఎస్ భరత్, అభిమన్యూ ఈశ్వరణ్, షబాజ్ నదీమ్, రాహుల్ చాహర్
నెట్ బౌలర్స్: అంకిత్ రాజ్‌పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, గౌతమ్, సౌరభ్ కుమార్