Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా బ్లూకు రోహిత్‌ శర్మ, రెడ్‌కు పార్ధీవ్ పటేల్

హైదరాబాద్: గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన ఓపెనర్ రోహిత్ శర్మ దేవదార్‌ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఈ ట్రోఫీలో పాల్గొనే ఇండియా బ్లూ, ఇండియా రెడ్‌ జట్ల బృందాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇండియా బ్లూకు రోహిత్‌ శర్మ, ఇండియా రెడ్‌కు పార్థివ్‌ పటేల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు ఇండియా బ్లూలో, శిఖర్‌ ధావన్‌కు ఇండియా రెడ్‌లో చోటు దక్కింది. ఈ రెండు జట్లతో పాటు విజయ్‌హజారే ట్రోఫీ విజేత తమిళనాడు కూడా ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు విశాఖపట్నంలో డీబీ దేవదార్‌ ట్రోఫీ జరుగనుంది.

తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ శర్మ పాస్ కావడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో రోహిత్‌ ముంబై తరఫున బరిలోకి దిగాడు. 2016 అక్టోబరులో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ గాయపడిన సంగతి తెలిసిందే.

BCCI announces India ‘Blue’ and ‘Red’ teams for Deodhar Trophy 2017

ఇండియా బ్లూ జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), మన్‌దీప్‌ సింగ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, అంబటి రాయుడు, మనోజ్‌ తివారీ, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), దీపక్‌ హుడా, హర్భజన్‌ సింగ్‌, క్రునాల్‌ పాండ్యా, షాబాజ్‌ నదీమ్‌, సిద్ధార్త్‌ కౌల్‌, శార్థూల్‌ ఠాకూర్‌, కృష్ణ, పంకజ్‌ రావ్‌.

ఇండియా రెడ్‌ జట్టు: పార్థివ్‌ పటేల్‌ (కెప్టెన్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌), శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, మయాంక్‌ అగర్వాల్‌, కేదార్‌ జాదవ్‌, ఇషాంక్‌ జగ్గీ, గుర్‌కీరత్‌ మన్‌, అక్సర్‌ పటేల్‌, అక్షయ్‌ కామేశ్వర్‌, అశోక్‌ దిండా, కుల్వంత్‌ ఖేజ్రోలియా, ధావల్‌ కులకర్ణి, గోవింద పొద్దర్‌

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+