

హైదరాబాద్: ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌ని బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆతిథ్య భారత జట్టుతో రెండు టీ20లతో పాటు ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరు వేదికగా ఆరంభం కానుంది.
ఆ తర్వాత రెండో టీ20 ఫిబ్రవరి 27న తేదీన విశాఖపట్నంలో జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మార్చి2 నుంచి 13వ తేదీ వరకూ ఐదు వన్డేల సిరీస్ జరుగనుంది. రెండు టీ20లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.00 గంటలకు జరుగనుండగా... వన్డేలు మాత్రం మధ్యాహ్నాం 1:30 గంటలకు జరగనున్నాయి.
ఐదు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే మార్చి 2న హైదరాబాద్‌లో, రెండో వన్డే 5వ తేదీన నాగ్‌పూర్‌లో, మూడో వన్డే 8వ తేదీన రాంచీలో, నాలుగో వన్డే 10వ తేదీన మొహాలీలో, ఐదో వన్డేలో 13వ తేదీన ఢిల్లీలో జరగనుంది. 2017లో భారత్‌లో చివరిసారి ఆసీస్ పర్యటించింది. ఆ ద్వైపాక్షిక సిరీస్‌లో ఐదు వన్డేల సిరీస్‌తో పాటు, మూడు టీ20ల సిరీస్ జరిగింది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో గెలుపొందగా, టీ20 సిరీస్ 1-1తో సమం అయింది.
| Australia's Tour of India | |||
| S.NO | Date | Match | Venue |
| 1 | 24th February | 1st T20I | Bengaluru |
| 2 | 27th February | 2nd T20I | Visakhapatnam |
| 3 | 2nd March | 1st ODI | Hyderabad |
| 4 | 5th March | 2nd ODI | Nagpur |
| 5 | 8th March | 3rd ODI | Ranchi |
| 6 | 10th March | 4th ODI | Mohali |
| 7 | 13th March | 5th ODI | Delhi |