For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజాకు ప్రమోషన్, తెలుగోడికి చోటు: విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు జట్టు ప్రకటన

IND vs WI: ఆసియా కప్ 2025 టోర్నీతో బిజీ ఉన్న టీమిండియాకు సంబంధించి ఓ కీలక ప్రకటన వెలువడింది. వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి జరగనున్నరెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి.

స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టుకు కొత్త వైస్-కెప్టెన్‌గా నియమించారు. గతంలో జట్టులో ఉన్న బ్యాటర్ కరుణ్ నాయర్‌ను ఈ సిరీస్ నుంచి తప్పించారు. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ జట్టులో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు, ఆ టోర్నమెంట్ ముగిసిన వెంటనే వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి జట్టు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

BCCI announced the squad for the India vs West Indies Test series

కరుణ్ నాయర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
టీమిండియాలోకి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన కరుణ్ నాయర్‌ను ఈ సిరీస్ కోసం పక్కన పెట్టారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాతే ఆయన ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే అక్కడ కరుణ్ నాయర్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో సెలెక్టర్లు ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

కొత్తగా జట్టులో చోటు దక్కించుకున్నది ఎవరు?
కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌కు జట్టులో అవకాశం దక్కింది. పడిక్కల్ ఇటీవలి దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడం ఈ ఎంపికకు కారణం. పడిక్కల్‌తో పాటు ఎన్. జగదీశన్ కూడా స్క్వాడ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్ మధ్యలో రిషబ్ పంత్ గాయపడగా.. అప్పుడు జగదీశన్‌కు జట్టులో అవకాశం లభించింది. ఈసారి ఆయనను ముందుగానే స్క్వాడ్‌లో చేర్చారు.

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్,కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్.

Story first published: Thursday, September 25, 2025, 13:27 [IST]
Other articles published on Sep 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+