India Odi Squad for Westindies Tour : సీనియర్లకు రెస్ట్, కెప్టెన్‌గా ధావన్, వెస్టిండీస్‌తో ఆడే టీం ఇదే..!

టీమిండియా ఇంగ్లాండ్‌తో ఆడబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తదనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ఇంగ్లాండ్ టూర్ జులై 17న ముగుస్తుంది. అనంతరం టీమిండియా జులై 22న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది. అనంతరం 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 7న ముగియనుంది. ఇక ఈ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోయే వన్డే జట్టును ఆల్ ఇండియా సెలెక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 16మందిని ఎంపిక చేసింది.
ఈ వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లందరికీ బీసీసీఐ రెస్ట్ ఇచ్చినట్లుంది. ఈ వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు. దీంతో ఈ వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ఇండియా టీంలో మూడు ఫార్మాట్లకు కలిపి ఎనిమిదిసార్లు కెప్టెన్లను మార్చడం గమనార్హం.

ఓపెనర్ల రేసులో అయిదుగురు
సెలక్షన్ కమిటీ.. పేర్కొన్న టీంలో లిస్టులో ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ఛాయిస్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. కెప్టెన్ శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శుభ్ మన్ గిల్‌లు ఓపెనర్ల బరిలో ఉండే అవకాశముంది. ఇందులో ధావన్ పక్కా కాబట్టి మిగతా నలుగురిలో ఎవరు ఓపెనింగ్ దిగుతారో చెప్పడం కొంచెం కష్టమే.
ఇక ధావన్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా దిగే అవకాశం ఉండకపోవచ్చు.. అసలు అతనికి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో ఎందుకంటే అతను వికెట్ కీపర్ కం బ్యాటర్‌గా సెలెక్ట్ అయ్యాడు. దీంతో సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, గిల్ మధ్య ఓపెనింగ్ పోటీ ఉంటుంది. ఒకవేళ ఓపెనింగ్ దక్కకుంటే తర్వాత స్థానాల్లో వీరికి అవకాశం దక్కొచ్చు.

మిడిలార్డర్ ఓకే.. మరి ఫినిషర్లు ఏరీ?
ఇక మిడిలార్డర్లో సెలెక్షన్ కమిటీ ఎక్కువ పేర్లను ప్రతిపాదించకపోవడం వల్ల వారి స్థానాలు కాస్త ఫిక్స్ అయినట్లు అర్థమవుతుంది. శ్రేయస్ అయ్యార్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు. ఇక సంజూ, గిల్ సైతం టాపార్డర్ బ్యాటర్లే కాకుండా మిడిల్ ఆర్డర్లోనూ ఆడగలరు. అయితే హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ లాంటి ఫినిషర్లు మాత్రం ఈ జట్టుకు ఎంపికకాకపోవడం కాస్త ఆలోచించాల్సిన విషయం.

బౌలర్ల విషయానికొస్తే..
ఇక బౌలర్ల విషయానికొస్తే స్పిన్నర్ల విభాగాన్ని యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ ఎప్పటిలాగే ఎంపికయ్యారు. అశ్విన్‌కు మొండిచేయి తప్పలేదు. రవీంద్రా జడేజా వైస్ కెప్టెన్ కాబట్టి.. తుది జట్టులో అక్షర్ పటేల్ స్థానం డౌటే. ఇక పేసర్ల విషయంలో అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్‌లు ఎంపికయ్యారు. ఇటీవల అర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ టీ20 సిరీస్‌లకు ఎంపికైనా అతనికి ప్లేయింగ్ 11లో ఛాయిస్ రాలేదు. భువీకి రెస్ట్ ఇచ్చారో పక్కన పెట్టారో తెలీదు. హర్షల్ పటేల్‌ను పక్కనపెట్టారు. బుమ్రా, షమీకి రెస్ట్ ఇచ్చారు. దీంతో పేస్ విభాగంలో సీనియర్ బౌలర్ లేకుండా ఇండియా బరిలోకి దిగబోతుంది.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా వన్డే జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్, టీమిండియాతో వన్డే సిరీస్ షెడ్యూల్
జులై 22: మొదటి వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్.
జూలై 24: రెండో వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్.
జూలై 27: మూడో వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్.
వెస్టిండీస్ స్థానిక కాలమానం ప్రకారం.. 9:30amకు వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇండియా కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు ప్రారంభమవుతాయి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications