For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయిన భారత జట్టు ఇదే! రాయ్ అరంగేట్రం!!

BCCI Announced India Women’s Squad For England Tour, Indrani Roy gets maiden call up

ముంబై: రాబోయే సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్ల కోసం.. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. టెస్ట్, వన్డే జట్లకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుండగా.. టీ20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథిగా ఉండనుంది. వికెట్ కీపర్-బ్యాటర్ ఇంద్రాణి రాయ్‌కు ఇంగ్లండ్ పర్యటనతో తొలిసారి టెస్ట్, వన్డే జట్టులో చోటు దక్కింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గయాక్వాడ్ గాయం కారణంగా తప్పుకుంది.

దక్షిణాఫ్రికా హోమ్ సిరీస్ ఆడని నయా బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ, సీనియర్ పేసర్ శిఖా పాండేలకు మూడు ఫార్మాట్‌లలో చోటు దక్కింది. ఇంగ్లండ్ పర్యటన జూన్ 16 నుండి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భారత మహిళా జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. 2014 తర్వాత భారత మహిళలు ఆడనున్న టెస్ట్ మ్యాచ్ అదే కావడం విశేషం. భారత మహిళలు చివరిసారిగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ ఆడారు. అదే సంవత్సరంలో ఇంగ్లండ్ జట్టుపై కూడా టెస్ట్ ఆడారు. గత సంవత్సరమే ఈ పర్యటన ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ,రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్‌లో జరుగుతుంది. ఇక చివరిదైన మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్‌లో, రెండో టీ20 జూలై 11 హోవ్‌లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్‌లో షెడ్యూల్ అయి ఉన్నాయి.

టెస్ట్, వన్డే జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధనా, హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పునియా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ రానా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్), జులాన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్.

టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) స్మృతి మంధన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ రానా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్), శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్, సిమ్రాన్ దిల్ బహదూర్.

IPL 2021: టోర్నీకి ముందు కరోనా వ్యాక్సిన్‌కి నో చెప్పిన భారత క్రికెటర్లు.. ఇప్పుడేమో క్యూ! అసలు కారణం అదేనా?
https://telugu.mykhel.com/cricket/many-indian-and-foreign-players-refused-to-get-vaccinated-before-ipl-2021-034965.html

Story first published: Saturday, May 15, 2021, 13:30 [IST]
Other articles published on May 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+