ఓపెనర్లుగా రోహిత్, రాహుల్..
ఇక ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన వాళ్లలో బ్యాటింగ్ లైనప్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. కేఎల్ రాహుల్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అతను పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించినందున అతనికి జట్టులో చోటు దక్కింది. ఇక అతను గాయం, కరోనా తదితర కారణాల వల్ల ఇటీవల భారత్ ఆడిన పలు సిరీస్లకు దూరమైన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్ కాగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
విశ్రాంతికి బై.. కింగ్ కోహ్లీ ఆటకు సై
సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీతో మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎంపికవ్వడంతో మూడో స్థానంలో అతని చోటు ఫిక్సయింది. వరుసగా విండీస్, జింబాబ్వే పర్యటనకు కోహ్లీని పక్కన పెట్టడంతో అతను ఆసియా కప్ ఎంపికవుతాడో లేడో అనే సందేహాలు తీవ్రమయ్యాయి. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల కోహ్లీ సామర్థ్యాన్ని, అతని రికార్డులను సెలెక్షన్ కమిటీ తోసిపుచ్చలేకపోయింది. తద్వారా అతను జట్టుకు ఎంపికవ్వడంతో పాటు తుది జట్టులో వన్డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగడం ఖాయం.
మిడిలార్డర్లో సూర్య, పంత్, దీపక్ హుడా
ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో టీమిండియాకు అస్సెట్ ప్లేయర్‌గా మారిపోయాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతూ సెలెక్టర్లకు తీసుకోక తప్పదనేలా చేశాడు. . ఎలాగూ వికెట్ కీపర్ ప్లస్ జట్టు 5వ బ్యాటర్‌గా రిషబ్ పంత్ స్థానానికి ఢోకా లేదు. సెలెక్షన్ కమిటీ తొలి వికెట్ కీపింగ్ ఆప్షన్‌గా పంత్‌ను ఎంచుకుంది. ఇక మిడిలార్డర్ బ్యాటర్ మరో ఆప్షన్లలో దీపక్ హుడాకు చోటు దక్కింది. అయితే తుది జట్టులో దీపక్ హుడా ఆడే పరిస్థితి కన్పించడం లేదు.
హిట్టర్లుగా హార్దిక్, దినేష్ కార్తీక్
స్టాండ్ ఇన్ కెప్టెన్సీలోనూ, ఫినిషింగ్లోనూ అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ విభాగంలో భారత్‌కు బిగ్ అస్సెట్. అందువల్ల అతను జట్టులో మండెటరీ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్లో అదరగొట్టిన హార్దిక్.. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్లో ఆకట్టుకోలేకున్నా.. చివరి టీ20లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సత్తా చాటాడు. ఇకపోతే దినేష్ కార్తీక్ జట్టుకు ఎంపికైన అతనికి తుది జట్టులో అవకాశాలు దక్కడం దాదాపు కష్టమేనని చెప్పాలి. భారత్ అదనపు బ్యాటర్ కోరుకుంటేనే అతనికి చోటు దక్కే పరిస్థితి నెలకొంది. ఫినిషింగ్లో డీకే ఇటీవల కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

నలుగురు స్పిన్నర్లు
స్పిన్ ఆల్రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా ఎంపికకాగా.. అనూహ్యంగా స్పిన్నర్లలో జడేజాతో సహా నలుగురు ఎంపికయ్యారు. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్నోయ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్‌కు నిరాశ తప్పలేదు. అయితే స్పిన్ విభాగంలో చాహల్ తుది జట్టులో చోటు దక్కుతుంది. మరీ అశ్విన్, బిష్ణోయ్‌లను ఇద్దరినీ ఎందుకు తీసుకున్నారనేది అంతుపట్టడం లేదు. వీరిలో ఒకరు దాదాపుగా బెంచ్ మీదే ఉంటారు.

పేస్ బౌలర్ల విభాగంలో వీరు
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో పేసర్లు బరిలోకి దిగనున్నారు. సీనియర్ మోస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భారత పేస్ దళాన్ని నడిపించనున్నాడు. అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ జట్టులో చోటు సంపాదించారు. దీపక్ చాహర్ బ్యాకప్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. హర్షల్ పటేల్, బుమ్రా గాయపడడం అవేశ్ ఖాన్, అర్షదీప్‌లకు లక్కీ అయిందనే చెప్పాలి. అర్షదీప్ పర్లేదు కానీ.. ఒక్కోసారి అవేశం స్టార్ భారీగా పరుగులిచ్చేస్తాడు. మరీ భారత పేస్ దళం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవిబిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.
బ్యాకప్ ప్లేయర్లు : శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చాహర్


Click it and Unblock the Notifications
