Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ సిరిస్‌కు భారత జట్టు: కోహ్లీ కెప్టెన్సీలో ధోని, యువరాజ్

హైదరాబాద్: ఇంగ్లాండ్ సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించింది. ఈ సిరిస్‌కు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించనున్నారు. వన్డే, టీ20ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ కోహ్లీని కెప్టెన్‌గా ప్రకటించింది. బీసీసీఐ తాజా నిర్ణయంతో మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా కోహ్లీ నియమితుడయ్యాడు.

త్వరలోనే ఇంగ్లండ్ తో టీమిండియా వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ మేరకు బిసిసిఐ జట్టును ప్రకటించింది. కెప్టెన్నీ భాద్యతల నుండి తప్పుకొన్న ధోని ఈ సిరిస్‌లో జట్టు సభ్యుడిగా కొనసాగనున్నారు.

bcci announced cricket team for england series ,

ఇంగ్లండ్ జట్టుతో వన్డే లతో పాటు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లను కూడా టీమిండియా ఆడనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నాడు బిసిసిఐ వన్డే జట్టును ప్రకటించింది. జట్టులో యువరాజ్ సింగ్‌కు స్థానం దక్కింది. వన్డేలతో పాటు, టెస్టులకు కూడ కోహ్లి కెప్టెన్ గా కొనసాగనున్నారు.

మూడు వన్డేలకు భారత జట్టు:

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కెఎల్ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మహేంద్ర సింగ్ ధోనీ, మనీశ్‌ పాండే, అజింక్యా రహానే, యువరాజ్‌సింగ్‌, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, బుమ్రా, భువనేశ్‌కుమార్‌, ఉమేశ్‌యాదవ్‌, హార్దిక్ పాండ్యా

మూడు టీ20లకు భారత జట్టు:

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, మన్‌దీప్‌సింగ్‌, మహేంద్ర ధోనీ, సురేశ్‌ రైనా, యువరాజ్‌సింగ్‌, హార్థిక్‌ పాండ్యా, బిషప్‌, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, మనీశ్‌పాండే, అశీష్‌ నెహ్ర, బుమ్రా

ఇంగ్లాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌కి భారత జట్టు:

ఇంగ్లాండ్‌తో రెండో వార్మప్ మ్యాచ్‌కి భారత జట్టు:

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+